Foods To Avoid With High Blood Pressure: అధిక రక్తపోటు లేదా హైబీపీ ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండ వ్యాధి వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దానిని నియంత్రించడంలో సహాయపడవచ్చు. అయితే రక్తపోటును పెంచే ఆహారపదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
అధిక రక్తపోటును పెంచే కొన్ని ఆహారాలు:
ఉప్పు లేకుండా ఏ ఆహారం రుచిగా తయారు కాదు. ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అయితే అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది శరీరంలో ద్రవ నిలుపుదలకు దారితీస్తుంది. ఇది రక్తపోటు పెరుగుదలకు కారణమవుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారు రోజుకు 2,300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ సోడియం తినకుండా ఉండాలి.
ప్రస్తుతకాలంలో చాలా మంది ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలను తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీనిలో అధికశాతం సోడియం ఉంటుంది. అలాగే కొవ్వు, చక్కెరలో ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ రక్తపోటు పెరుగుదలకు దోహదపడతాయి. వీటితో పాటు ఎరుపు మాంసం తీసుకోవడం శరీరానికి మంచికాదు. అందుకంటే ఇందులో కొవులో ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తనాళాలను గట్టిపడేలా చేస్తాయి. దీని వల్ల రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది రక్తపోటును మరింగా పెంచుతుంది.
పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు సంతృప్త కొవ్వులో కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా మంచి తీపి వస్తువులు తినడానికి మక్కువ చూపుతారు. స్వీట్లు, డెజర్ట్లు చక్కెరలో ఎక్కువగా ఉంటాయి. ఇది క్యాలరీల పెరుగుదలకు దారితీస్తుంది, బరువు పెరగడానికి దోహదపడుతుంది. ఇది రక్తపోటు పెరుగుతుంది. కార్బోనేటెడ్ పానీయాలు చక్కెర, సోడియం రెండింటిలో ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా అతిగా ఉపయోగించే నూనె పదార్థాలు తినడం వల్ల గుండె సమస్యలు పెరుగుతాయి. అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ వల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటికి బదులుగా మంచి పోషకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే అధిక రక్తపోటును నియంత్రించడంలో ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అనేది మనం తెలుసుకుందాం.
అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఆహారాలు:
పండ్లు-కూరగాయలు: పండ్లు, కూరగాయలు పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌తో సహా రక్తపోటును తగ్గించడంలో సహాయపడే పోషకాలతో నిండి ఉంటాయి.
ధాన్యాలు: ధాన్యాలు ఫైబర్‌కు మంచి మూలం ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు: తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి