/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Flax Seeds Benefits: అవిసె గింజలను సూపర్‌ ఫుడ్‌ అని కూడా పిలుస్తారు. ఇందులో బోలెడు పోషకాలు, శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో శరీరానికి అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు ఇందులో ఎక్కువగా లభిస్తాయి. అవిసె గింజలలో ఒమేగా-3, ఫైబర్‌, ప్రోటీన్‌, విటమిన్‌లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, కడుపు సంబంధిత సమస్యలకు, కండరాలను దృఢంగా తయారు చేయడంలో, విటమిన్‌ లోపంతో బాధపడేవారికి ఇది ఒక చక్కటి ఆహారం అని వైద్యులు చెబుతున్నారు. మరి ఇన్ని అద్భుతమైన లాభాలు కలిగిన అవిసెగింజలు శరీరానికి ఎలా సహాయపడుతాయి అనేది తెలుసుకుందాం. 

అవిసెగింజలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడంలో ఏంతో సహాయపడుతాయి. ముఖ్యంగా ఇందులో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ఇవి కీలక ప్రాతను పోషిస్తాయి. పెద్దా, చిన్నా అనే తేడాలేకుండా చాలా మంది మలబద్దకం, గ్యాస్‌, ఊబరం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం మందులు, చికిత్సలు పొందుతున్నారు. అయితే ఎలాంటి చికిత్సలతో పనిలేకుండా కేవలం ఈ అవిసెగింజలతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణసమస్యలు, ఇతర కడుపు సంబంధిత సమస్యలు కూడా నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

అవిసెగింజలలో లిగ్నాన్స్‌ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటుంది. ఇవి క్యాన్సర్ల వృద్ధిని నిరోధించడంలో ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్‌ సమస్యతో బాధపడేవారు దీని ప్రతిరోజు తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ప్రస్తుతకాలంలో  టైప్-1, టైప్‌-2 డయాబెటిస్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో అవిసె గింజలు ఏంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణుల చెబుతున్నారు. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారికి అవిసెగింజలు ఒక వరం. దీనితో రక్తపోటును తగ్గించుకోవచ్చు అలాగే హార్ట్‌ స్ట్రోక్‌ ప్రమాదాన్ని నివారించవచ్చు. 

అవిసెగింజలు కేవలం గుండెకు మాత్రమే కాకుండా చర్మ సమస్యలకు కూడా ఎంతో సహాయపడుతాయి. ఇందులోని ఒమేగా-3 చర్మానికి అందించడంలో మెటిమలను తొలగించడంలో ఎంతో ఉపయోగపడుతాయి. చర్మ పరిస్థితులను మెరుగుపరచడంలో ఎంతో మంచివి. అధిక బరువు సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు పడేవారు కేవలం ఒక సూప్‌ అవిసెగింజల పొడి తీసుకోవడం వల్ల ఎన్నో మంచిఫలితాలు పొందుతార. ఈ పొడి వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. కొవ్వు ఉన్న భాగం సులువుగా తగ్గిస్తుంది. అలాగే ఇందులోని ఫైబర్‌ కంటెట్‌ కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలిని నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

అవిసె గింజలను ఎలా తీసుకోవాలి:

* అవిసె గింజలను పొడి చేసి ధాన్యాలు, ఓట్స్ లేదా పెరుగులో కలపవచ్చు.
* వాటిని రొట్టెలు, మఫిన్లు, కుకీలలో కాల్చవచ్చు.
* వాటిని సూప్‌లు, కూరగాయల వంటకాలకు జోడించవచ్చు.
* అవిసె గింజల నూనెను సలాడ్ డ్రెస్సింగ్‌లు లేదా పొడిని తీసుకోవడం చాలా మంచిది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Flaxseeds Can Reduce Diabetes, Weightloss, High Blood Pressure And More Sd
News Source: 
Home Title: 

Flaxseeds Benefits: డయాబెటిస్‌, అధికరక్తపోటు వ్యాధిగ్రస్తులకు ఈ గింజలు ఒక వరం..!

Flaxseeds Benefits: డయాబెటిస్‌, అధికరక్తపోటు వ్యాధిగ్రస్తులకు ఈ గింజలు ఒక వరం..!
Caption: 
Zee Telugu News
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
డయాబెటిస్‌, అధికరక్తపోటు వ్యాధిగ్రస్తులకు ఈ గింజలు ఒక వరం..!
Shashi Maheshwarapu
Publish Later: 
No
Publish At: 
Wednesday, July 10, 2024 - 12:04
Created By: 
Shashi Maheshwarapu
Updated By: 
Shashi Maheshwarapu
Published By: 
Shashi Maheshwarapu
Request Count: 
13
Is Breaking News: 
No
Word Count: 
343