Fatty Liver Causes & Symptoms: కాలేయం మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం. ఇది రక్తం నుంచి హానికరమైన పదార్థాలను ఫిల్టర్ చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. దీని కారణంగా చాలా మందిలో ఫ్యాటీ లివర్ సమస్య వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు వస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఫ్యాటీ లివర్ సమస్యల కారణంగా ఇతర వ్యాధులు కూడా వస్తాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొవ్వు కాలేయ సమస్య కారణంగా ఈ వ్యాధులు రావొచ్చు:
ఉదరం పై భాగంలో నొప్పి వస్తుంది:
కాలేయంపై కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పేరుపోవడం వల్ల చాలా మందిలో ఉదరం ఎగువ భాగంలో నొప్పి సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో పొత్తికడుపు ఎగువ, కుడి వైపున కూడా నొప్పుల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు కూడా మానుకోవాల్సి ఉంటుంది.
కాళ్లలో నొప్పి:
ఫ్యాటీ లివర్ వల్ల కాళ్లు, కీళ్లలో వాపు సమస్య కూడా రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే తరుచుగా కాళ్లలో నొప్పి, పాదాలలో నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలున్నవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
భుజాలలో నొప్పి:
ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే భుజాలలో నొప్పి సమస్యలు కూడా రావొచ్చు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొందరిలో భుజాలలో నొప్పి కారణంగా నరాలు బలహీనంగా కూడా మారొచ్చు. కాబట్టి ఈ నొప్పితో బాధపడేవారు తప్పకుండా మంచి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Diet: బరువు తగ్గడానికి రోటీ బెటరా, రైస్ బెటరా? ఎలా వెయిట్ లాస్ అవుతారో తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook