Skin Care Tips: చర్మ సంరక్షణ పద్దతులను పాటించే ముందు మీ చర్మం ఏ రకానికి చెందినదో తెలుసుకోవటం ముఖ్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరి చర్మ రకం తనదైన, ప్రత్యేక నిర్మాణాన్ని కలిగి ఉండి మరియు ప్రత్యేక గుణాలను కలిగి ఉంటుంది.
మీ ముఖానికి ఉత్పత్తులను వాడటానికి ముందుగా చర్మ అంతర్భాగం, దాని నిర్మాణం గురించి మొదటగా తెలుసుకోవాలి. చర్మ సంరక్షణ ఉత్పత్తులను గుడ్డిగా వాడకుండా, చర్మ రకాన్ని తెలుసుకొని మరియు చర్మ కణాలకు ఎలాంటి ఉత్పత్తి కావాలో తెలుసుకొని, సంరక్షణ ఉత్పత్తులను వాడటం మంచిది. సాధారణంగా ఇందే చర్మ రకాల గురించి రకం తెలుసుకొని అవగాహన పొందటం వలన మీ చర్మం ఎలాంటి రకం మరియు మీ చర్మానికి ఏ రకం ఉత్పత్తులను వాడలో అవగాహన వస్తుంది. మీ చర్మం ఏ రకానికి తెలిసిందో తెలిపే కొన్ని సూచనలు కింద పేర్కొనబడింది.
5 రకాల చర్మాలు
Also Read: India Vs Pakistan Match History: గెట్ రెడీ ఫర్ హై ఓట్లేజ్ మ్యాచ్.. బల్బులు పగలాల్సిందే!
సాధారణ చర్మం
మీరు సాధారణ రకానికి చెందిన చర్మాన్ని కలిగి ఉన్నారా! అయితే ఈ రకం చర్మ కణజాలల నుండి నూనెల సరైన స్థాయిలో ఉత్పత్తి చెందుతాయి. ఈ రకం చర్మం లేతగా, మృదువుగా ఉండి, బలంగా ఉంటుంది. ఈ రకం చర్మం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుకోనుండానే శుభ్రంగా, మృదువుగా మరియు ఆకర్షణీయంగా కనపడతుంది.
పొడి చర్మం
పొడి చర్మం గట్టిగా మరియు పొరలుగా ఉంటుంది మరియు ముడతలతో పాటుగా చర్మంపై చిన్న చిన్న రంద్రాలు కూడా ఉంటాయి. పొడి చర్మం వలన మీ చర్మం వయసు మీరినట్టుగా కనిపించటమే కాకుండా, దురదలను కూడా కలుగచేస్తుంది. ఈ రకమైన చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఎప్పటికపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
జిడ్డు చర్మం
జిడ్డు చర్మం కలిగిన వారిలో చర్మం ఎల్లపుడు నూనెలతో, మందంగా, మరియు షైనీగా, విస్తారమైన రంధ్రాలను కలిగి ఉంటుంది. వీటి ఫలితంగా, మొటిమలు కలిగే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి. జిడ్డు చర్మం కలిగి ఉన్న వారికి కలిగే ప్రయోజనం- వయసు మీరినట్టుగా కనిపించకపోవటం మరియు ముడతలు కూడా తక్కువగానే ఉంటాయి. జిడ్డు చర్మం కలిగి ఉన్న వారు క్రీమ్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
Also Read: Samantha Defamation Case: సామాన్యులైన... సమంత అయినా... ఒక్కటే: కూకట్‌పల్లి కోర్టు
మిశ్రమ చర్మ రకం
చాలా మంది స్త్రీలు, పొడి మరియు జిడ్డు చర్మాన్ని రెండింటిని కలిగి ఉంటారు. ఈ రకం చర్మాన్నే మిశ్రమ రకంగా పేర్కొంటారు. ఈ రకమైన చర్మం కలిగీ ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోవాలి. పొడిగా ఉండే చెంపలు మరియు కంటి చుట్టూ ప్రాంతాలలో క్రీమ్ లు ఎక్కువగా ఉండే మరియు తేమభరిత ఉత్పత్తులను వాడండి. జిడ్డుగా ఉండే ముక్కు మరియు నుదిటి పైన ఎల్లపుడు శుభ్ర పరుస్తూ ఉండాలి.
సున్నితమైన చర్మం
ఈ రకం చర్మం కూడా త్వరగా పొడిగా మారుతుంది మరియు సులువుగా దురదలకు లోనవుతుంది. సున్నితమైన చర్మం ఎర్రగా మరియు దురదలను కలిగించి, చికాకులకు గురి చేస్తుంది.
మీ చర్మ రకాన్ని ఎలా నిర్దారించటం?
మొదటి దశ
మొదటగా శుభ్రపరిచే ఉత్పత్తుల ద్వారా చర్మంపై ఉన్న మేకప్ లను తొలగించి, శుభ్రంగా కడిగి, ఎండే వరకు వేచి ఉండండి. ఇలా చేయటం వలన చర్మం పై ఉండే నూనెలు మరియు పోసి దుమ్ము, ధూళి తొలగించబడతాయి.
రెండవదశ
మీ ముఖాన్ని కడిగిన తరువాత కనీసం ఒక గంట వరకు వేచి ఉండటం వలన మీ చర్మం సాధారణ స్థితికి వస్తుంది. ఈ పరిస్థితులలోనే మీ చర్మం ఏ రకానికి చెందినదో తెలుసుకోవచ్చు మరియు ఈ సమయంలో మీ చర్మాన్ని చేతితో కానీ, ఇతర వస్తువులతో తాకకుండా జాగ్రత్త తీసుకోండి.
Also Read: India Crosses 1 Billion Vaccination: భళా 'భారత్'.. 100 కోట్ల టీకాల పంపిణీ పూర్తి
మూడవ దశ
ముక్కు చుట్టూ మరియు నుదిటి ప్రాంతంలో నూనెలు ఎక్కువగా ఉత్పత్తి చెందుతాయి కావున, టిస్సు పేపర్ తో తుడవండి.
నాలుగవ దశ
చివరగా టిస్సు పేపర్ ను గమనించటం ద్వారా మీ చర్మ రకాన్ని మీరు పూర్తిగా కనుగొన్నవారవుతారు. కింద తెలిపిన వాటిని చదివి మీ చర్మ రకాన్ని నిర్దారణ చేసుకోండి.
1) సాధారణ చర్మం ఎలాంటి నూనెలను ఉత్పత్తి చెందించదు.
2) జిడ్డుగా ఉండే చర్మ కణాల ద్వారా నూనెలు ఎక్కువగా ఉత్పత్తి చెందించబడి, జిడ్డుగా కనపడతాయి.
3) పొడి చర్మం రేకులు లేదా పొరలుగా కనపడుతుంది.
4) మిశ్రమ చర్మ రకం పైన తెలిపిన అన్నిటిని చూపిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook