Diabetes Symptoms: ఇలా పాదాల్లో తరచుగా సమస్యలు వస్తే ప్రమాదమే.. వీరు జాగ్రత్తగా ఉండాలి..

Diabetes Symptoms In Feet: మధుమేహం బారిన పడితే అది జీవత కాలం వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఈ సమస్యలు తీవ్ర తరం కాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే శరీరంలో మధుమేహం తీవ్ర తరమైతే పలు రకాల లక్షణాలు ఉత్పన్నమవుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2022, 12:46 PM IST
  • మధుమేహం సమస్యలు తీవ్ర తరంగా మారితే..
  • పాదాల్లో చర్మ సమస్యలు వస్తాయి.
  • గోళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.
Diabetes Symptoms: ఇలా పాదాల్లో తరచుగా సమస్యలు వస్తే ప్రమాదమే.. వీరు జాగ్రత్తగా ఉండాలి..

Diabetes Symptoms In Feet: మధుమేహం బారిన పడితే అది జీవత కాలం వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఈ సమస్యలు తీవ్ర తరం కాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే శరీరంలో మధుమేహం తీవ్ర తరమైతే పలు రకాల లక్షణాలు ఉత్పన్నమవుతాయి. శరీరంలోని చక్కెర పరిమాణాలు అధిక పరిమాణంలో పెరిగితే అది టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్‌లకు దారి తీయోచ్చని నిపుణులు తెలుపుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు పాదాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే వీటిని ముందుగానే గమనించి.. వైద్యులను సంప్రదించడం చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేక పోతే ప్రాణాంతక సమస్యలుగా మారే అవకాశాలున్నాయి.

ఈ లక్షణాలు ప్రమాదకరం:

పాదాల్లో చర్మ సమస్యలు:
అరికాళ్లు, కాలి వేళ్ల మధ్య చర్మ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇవి కేవలం రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు తరచుగా వస్తే.. తప్పకుండా వీరు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

అథ్లెట్ల పాదాల సమస్య:
రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే.. అథ్లెట్స్ ఫుట్ అనే సమస్యలు వస్తాయి. అథ్లెట్స్ ఫుట్ అనేక ఇతర కారణాల వల్ల కూడా రావొచ్చు.. కానీ ఇవి తరచుగా సంభవింస్తే తప్పకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగినట్లేనని నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా రావొచ్చు.

గోళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్:
గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే.. డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా మందిలో కాలి గోరు రంగు కూడా మారుతుంది. కావున ఇలాంటి సమస్యల బారిన పడితే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

పాదాల నొప్పి, వాపు:
అడుగుల్లో వాపు, తరచుగా నొప్పి ఉంటే.. పలు రకాల  జాగ్రత్తగా వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో మధుమేహానికి సంకేతం కావచ్చు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News