Diabetes Breakfast: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ప్రజలు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో తినే ఆహారంతో పాటు పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో డయాబెటిక్ పేషెంట్లు కూడా తమ ఆహారం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొద్దిపాటి అజాగ్రత్త కూడా పెద్ద హాని తలపెట్టే అవకాశం ఉంది. కాబట్టి అల్పాహారం నుంచి భోజనం వరకు వారివారి అనారోగ్య సమస్యల బట్టి ఎంపిక చేసుకోవాలి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారంగా ఏమి తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ వారి కోసం అల్పాహారం..
వెజ్, నాన్-వెజ్ తినే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులను దృష్టిలో ఉంచుకొని, మేము ఓ డైట్ చెబుతాం. శాకాహారులు అల్పాహారంలో గంజిని తాగవచ్చు. నాన్-వెజ్ వ్యక్తులు తమ ఆహారంలో గుడ్లను చేర్చుకోవచ్చు. కాబట్టి ఈ రెండు వస్తువులను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
శాకాహారుల కోసం..
డయాబెటిక్ రోగులకు ఓట్ మీల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గ్లూకోజ్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే గ్లైసెమిక్ నియంత్రణను కొనసాగిస్తూ.. మీలో ఇన్సులిన్ స్థాయి పెంచడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
దీనితో పాటు ఓట్ మీల్ లో పప్పుధాన్యాలలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మీ ఆహారంలో బీన్స్, బఠానీలు, చిరుధాన్యాలు చేర్చడానికి ప్రయత్నించండి.
పచ్చి కూరగాయలు తినడం ద్వారా కూడా ఫిట్‌గానూ ఉండొచ్చు. ఆకుపచ్చ కూరగాయలు చాలా పోషకమైనవే కాకుండా చాలా తక్కువ జీర్ణమయ్యే పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆకు కూరలు తినడం మంచిది. ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవల్స్ మెయింటెయిన్ చేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి.
మాంసాహారుల కోసం..
మాంసాహారులు పైన పేర్కొన్న వాటితో పాటు ఉడికించిన కోడిగుడ్లను కూడా తినవచ్చు. గుడ్లలో అనేక పోషకాలు ఉంటాయి. వీటితో పాటు ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో ఉడించిన గుడ్లు చాలా ఉపయోగపడతాయి.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Almond Oil Benefits: చుండ్రుతో బాధపడే వారు ఈ రెండు ఇంటి చిట్కాలను పాటించండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook