Curry Leaves For Diabetes: భారతీయులు ఉదయం లేవగానే టీ తాగడం అలవాటుగా ఉంటుంది. ఈ ఆనవాయితి వందల ఏళ్ల నుంచి వస్తోంది. ప్రతి రోజూ టీని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా శరీరానికి ఉపశమనం లభిస్తుంది. అయితే మనం దేశంలో ప్రాంతాలను బట్టి టీలను తాగుతూ ఉంటారు. ప్రస్తుతం ఎక్కువగా వినియోగించే టీలలో హెర్బల్ టీ, పింక్ టీ, మసాలా టీ, అల్లం టీ, ఏలకుల టీలను అతిగా వినియోగిస్తున్నారని ఇటివలే పలు నివేదికల్లో తేలింది. అయితే ఇలాంటి టీలే కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు రకాల టీలను కూడా తాగాల్సి ఉంటుంది. ఇందులో కరివేపాకుతో తయారు చేసిన టీని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ టీని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కరివేపాకు వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?:
కరివేపాకు ఆహారంలో వినియోగించడం వల్ల సీజనల్ వ్యాధులు సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా కరిగిస్తుంది. కరివేపాకులో తగిన పరిమాణంలో ఐరన్, ఫాస్పరస్, విటమిన్లు కూడా ఉంటాయి. కాబట్టి అంటు వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాల్లో ఈ కరివేపాకులను తీసుకోవాల్సి ఉంటుంది.
కరివేపాకు టీ:
చాలా మందికి కరివేపాకు టీ గురించి అస్సలు తెలియదు. అయితే ఆయుర్వేద శాస్త్రంలో ఈ టీకి చాలా ప్రముఖ్యత ఉంది. ఈ ఆకులను 'మ్యాజికల్ లీఫ్' అని కూడా అంటారు. అయితే ఈ ఆకులతో తయారు చేసిన టీలను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుతుంది. అయితే ఇదే టీలో నిమ్మరసం, తేనె మిక్స్ చేసి తాగితే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
చాలా మంది బరువు తగ్గడానికి వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉశమనం పొందడానికి కరివేపాకుతో తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు బరువును తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ ఈ టీని రెండు నుంచి మూడు పూటలు తాగాల్సి ఉంటుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుసపరుచుతుంది:
మెడికల్ జర్నల్ నివేదిక ప్రకారం.. జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి తులసితో తయారు చేసిన టీ ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. టీ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్, డయేరియా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
డయాబెటిస్ నుంచి ఉపశమనం:
కరివేపాకుతో చేసిన టీ మధుమేహం సమస్యతో బాధపడేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి ప్రయోజనాలను కలిగించడమేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook