Curd Raita Side Effects: పెరుగు అంటే చాలా మందితకి ఇష్టం ఉంటుంది. దీనిని తినేందుకు అందరూ ఎంతో ఇష్టపడతారు. అంతేకాకుండా దీనిని వివిధ రకాల వంటకాల్లో వినియోగించడం వల్ల ఆహారం ఇంక రుచిగా మారుతుంది. ఇందులో విటమిన్ B-2, విటమిన్ B12, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి లక్షణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కావున శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువుల అందుతాయి. అయితే శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు కేవలం అధిక పరిమాణంలో ప్రోబయోటిక్స్ ఉన్న పెరుగు మాత్రమే తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది అనారోగ్యకరమైన పెరుగును తీసుకుంటున్నారు. వీటి వల్ల వివిధ రకాల శరీర సమస్యల బారిన పడుతున్నారు. అయితే తరచుగా పెరుగును తీసుకనే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా అస్సలు చేయకండి:
పెరుగు, చేపలు అస్సలు కలిపి తినకండి:
పెరుగు, చేపల్లో చాలా రకాల ప్రొటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. అయితే ఈ రెండింటి కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికమని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
పాలు, పెరుగు కలిపిన ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు:
పాలు, పెరుగు కలిపి చాలా రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారు. అయితే ఈ రెండు కలిపిన ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల అసిడిటీ, వికారం, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే చాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కావున ఈ రెండు కలిపిన ఆహార పదార్థాలను ఎప్పుడు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేయోద్దు:
ప్రస్తుతం చాలా మంది పెరుగు తిన్న వేంటనే మామిడిపండ్లను తింటున్నారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఇలా తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే పలు సందర్భాల్లో చర్మంపై అలర్జీ సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
ఉల్లిపాయ:
భారతీయ ప్రతి వంటకంలో ఉల్లిని ఉపయోగించడం చాలా సహాజం. అయితే ప్రస్తుతం చాలా హోటల్స్‌లో ఉల్లిపాయలతో పెరుగు కలిపి సలాడ్స్లా ఇస్తున్నారు. వీటిని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలా చేయడం వల్ల చర్మపై అలెర్జీ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook