Summer skin care : అసలే ఎండాకాలం. కాసేపు బయటకు వెళ్లివచ్చినా కూడా.. చమటల కారణంగా కాలుష్యం వల్ల.. ముఖం జిడ్డుగా మారిపోతుంది. మొటిమలు కూడా వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. ఇలాంటి సమయంలో ఇంట్లోనే కొన్ని వస్తువులతో ఫేస్ ప్యాక్ చేసుకుంటే మన చర్మాన్ని మనమే కాపాడుకోవచ్చు.
ఈ వేసవి కాలంలో ముఖానికి రాయడానికి పెరుగు కంటే మంచి ఔషధం ఉండదు. అందులో ఉండే నీటి శాతం మన ముఖాన్ని కూడా బాగా హైడ్రేట్ చేసి కాంతివంతంగా మారుస్తాయి. నల్ల మచ్చలు కూడా తగ్గడానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది. ఉట్టి పెరుగు మాత్రమే కాకుండా.. అందులో ఇంకేమైనా కలిపి ముఖానికి రాస్తే ఇంకా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మరి పెరుగుతో పాటు ముఖానికి ఇంకా ఏమీ రాయచ్చో చూద్దాం.
బాదంపప్పు:
బాదంపప్పులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ముఖాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు.. తక్షణ గ్లో ని కూడా ఇస్తాయి. ఒక 10 - 15 బాదం పప్పులను మెత్తగా పేస్ట్ చేసి పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేస్తే కాసేపట్లోనే మీ చర్మం మిలమిలామెరుస్తుంది.
బొప్పాయి:
బొప్పాయి తింటే ఆరోగ్యానికి మాత్రమే కాదు.. ముఖానికి రాసుకున్నా చర్మానికి కూడా ఎంతో మంచిది. ముఖం మీద ఉన్న మురికిని పోగొట్టి చర్మాన్ని శుభ్రపరచడానికి.. బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. పెరుగుతో కలిపి ముఖానికి రాస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. బొప్పాయి చర్మానికి కావాల్సినంత హైడ్రేషన్ ఇస్తుంది. మరోవైపు పెరుగు మీ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. నచ్చిన వాళ్ళు అందులో ఒక చెక్క నిమ్మకాయ కూడా వేసి రాసుకుంటే.. రెట్టింపు ప్రయోజనాలు చూడొచ్చు.
గంధం :
గంధం లో కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అసలే వేసవికాలం కాబట్టి ముఖానికి గంధం రాస్తే మృత చర్మ కణాలు తొలగిపోతాయి. ముఖం మళ్ళీ యవ్వనంగా కనిపిస్తుంది. కొంచెం గంధాన్ని పెరుగుతో పాటు కలిపి ముఖానికి రాస్తే ఆ కూలింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది.
నారింజ:
నారింజ లో ఉండే విటమిన్ సి చర్మానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించడంలో నారింజ తొక్కలు చాలా బాగా ఉపయోగపడతాయి. నారింజ తొక్కలను ఎండబెట్టి.. పౌడర్ చేసి.. దాన్ని ఒక రెండు స్పూన్ల పెరుగుతో కలిపి.. ముఖానికి రాసుకుంటే చాలు. ఇది ఒక మాయిశ్చరైజర లో కూడా పనిచేస్తుంది. లోపల నుంచి గ్లో ఇచ్చే ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తుంది.
టమాటా :
టమాటా కి చర్మాన్ని కాంతివంతంగా చేసే శక్తి ఉంటుంది. పోయిన గ్లో మళ్లీ తిరిగి తీసుకురావడానికి టమాటా ఉపయోగపడుతుంది. మొదటిసారి వాడినప్పుడే టమాటా ముఖంపై మంచి రిజల్ట్ చూపిస్తుంది. అలాంటిది టమాటా రసం, పెరుగు రెండూ కలిపి రాస్తే చర్మం మరింత అందంగా మారుతుంది. ఎక్కడికైనా సడన్ గా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు టమాటా రసాన్ని పెరుగుతో కలిపి ముఖానికి పట్టించి.. కాసేపు అయ్యాక కడిగేస్తే సరిపోతుంది. మేకప్ కూడా వేసుకోకుండానే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.
Also Read: Snake Shed his Skin: బాప్ రే.. కుబుసం విడుస్తున్న పాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter