Benefits Of Cucumber: మన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే పోషకరమైన ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం ప్రతిరోజు తీసుకొనే కూరగాయలు. వీటిలో అనేక పోషక లాభాలు ఉంటాయి. అయితే కూరగాయలలో కీరదోస గురించి తెలియని వారు ఉండరు. దీనిని మనం సలాడ్ ఎక్కువగా తీసుకుంటాము. మరి కొంతమంది చర్మం సంరక్షణలో ఉపయోగిస్తారు. అయితే కీరదోసకాయ వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
వేసవికాలంలో ఈ కీరదోసను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో 95% నీరు ఉండటం వల్ల, వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి ఇది చాలా మంచిది.
కీరదోస తినడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు:
కీరదోసలో అధిక శాతం నీరు ఉండటం వల్ల శరీరానికి అవసరమైన నీటిని అందిస్తుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య బారిన పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా కీరదోసలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, జీర్ణక్రియ మెరుగుపడటానికి మలబద్ధకం నివారించడానికి సహాయపడుతుంది. ఈ కీరదోసలో అతి తక్కవ కేలరీలు ఉండటం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు. కీరదోసలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. చర్మ సమస్యలకు కీరదోస ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ సి చర్మం పై మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలు రాకుండా సహాయపడుతుంది. కీరదోసలో విటమిన్ కె పుష్కలంగా లభించడం వల్ల , ముడి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కీరదోసలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల కండరాల నొప్పులు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. కీరదోసలోని కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కీరదోసలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనది.
వేసవిలో కీరదోసను ఎలా తినవచ్చు:
కీరదోసను ముక్కలుగా కోసి, ఉప్పు, మిరియాలు, నిమ్మరసం వేసి తినవచ్చు.
దీన్ని రైతాలో కూడా వేసుకోవచ్చు.
కీరదోస జ్యూస్ చేసి తాగవచ్చు.
సలాడ్‌లలో కూడా కీరదోసను వేసుకోవచ్చు.
ముఖ్య గమనిక:
కీరదోసను ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా కిడ్నీ సమస్యలు ఉన్న వారు కీరదోస తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఈ విధంగా కీరదోస మనకు ఎంతో మేలు చేస్తుంది. మీరు కూడా దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి