ucumber Drink Benefits: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడడానికి పలు రకాల చిట్కాలను ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. శరీరాన్ని డిటాక్సిఫై చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే దీని కోసం పలు రకాల డిటాక్స్ డ్రింక్స్‌ను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువును నియంత్రణ కోసం దోసకాయతో చేసిన డ్రింక్ తాగొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దోసకాయలో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరి..శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుందుకు కృషి చేస్తాయి. కావున దీనితో తయారు చేసిన డిటాక్స్ డ్రింక్ శరీరానికి మంచి లాభాలను చేకూర్చుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ డ్రింక్‌కు కావాల్సిన పదార్థం:
# 1 లీటరు నీరు
# 3 దోసకాయలు
# 4 నిమ్మకాయలు
# కొన్ని పుదీనా ఆకులు
తయారు చేసే విధానం:
-ముందుగా దోసకాయ, పుదీనా ఆకులను, నిమ్మకాయలను సన్నగా కోయాలి.
- ఇప్పుడు ఒక జగ్గులో నీళ్లు తీసుకుని అందులో దోసకాయ, నిమ్మ, పుదీనా ఆకులు వేయాలి.
- వాటిని బాగా కలపండి.
- ఇప్పుడు ఆ నీటిని కొన్ని గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి.
- నీరు చల్లబడ్డాక తాగాలి. ఈ డిటాక్స్ నీటిని రోజంతా కొద్దికొద్దిగా తాగవచ్చు.
- డిటాక్స్ వాటర్ రెగ్యులర్‌గా తాగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Also read:High Cholesterol Treatment: చెడు కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందడానికి రోజూ ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook