Calcium Foods To Eat: ఎముకలు, దంతాలు బలంగా ఉండాలంటే ఇవి తినండి

Calcium Foods To Eat: యుక్త వయస్సులో ఉన్నంత కాలం పెద్దగా తెలియకపోయినా.. యుక్త వయస్సు దాటి నడి వయస్సులోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ క్యాల్షియం లోపంతో బాధపడుతున్న వారిలో ఎముకలు అరిగిపోవడం, లేదా బలహీనం అవడం, దంతాలు బలహీనంగా మారడం వంటి సమస్యలు తలెత్తున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 1, 2023, 06:38 AM IST
Calcium Foods To Eat: ఎముకలు, దంతాలు బలంగా ఉండాలంటే ఇవి తినండి

Calcium Foods To Eat: రసాయనిక ఎరువులతో పండిస్తున్న పంటలు కారణంగా ఆహార పదార్థాల్లో పోషక విలువల లేమితో శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యమైనది  క్యాల్షియం లోపం. ఔను యుక్త వయస్సులో ఉన్నంత కాలం పెద్దగా తెలియకపోయినా.. యుక్త వయస్సు దాటి నడి వయస్సులోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ క్యాల్షియం లోపంతో బాధపడుతున్న వారిలో ఎముకలు అరిగిపోవడం, దంతాలు బలహీనంగా మారడం వంటి సమస్యలు తలెత్తున్నాయి. ఎందుకంటే.. ఎముకలతో పాటు దంతాలు ధృడంగా ఉండాలి అంటే.. వారిలో క్యాల్షియం సరైన మోతాదులో ఉండాల్సిందే. క్యాల్షియం లోపించినప్పుడు అది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలే సతమతం చేస్తుంటాయి.

క్యాల్షియం లోపంతో బాధపడేవారిలో ఎముకలు వీక్ అవుతాయి. దంతాలు కూడా బలహీనంగా తయారవుతాయి. న్యూరోమస్క్యులర్ సమస్యలతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్యాల్షియమే కావాలి అంటే కేవలం పాలు మాత్రమే కాదు.. క్యాల్షియం పుష్కలంగా ఉన్న ఇతర ఆహార పదార్థాలు కూడా ఇంకా ఉన్నాయి.  

పచ్చని ఆకు కూరలు :
బచ్చలి ఆకు కూర, పాల కూర వంటి పచ్చటి ఆకు కూరల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. క్యాల్షియంతో పాటు పొటాషియం, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ క్యాల్షియం అధికంగా ఉండే పచ్చటి ఆకు కూరలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కండరాల నొప్పిని దూరం చేస్తాయి. 40 ఏళ్లు పైబడిన స్త్రీలలో క్యాల్షియం లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

పెరుగు :
పెరుగులోనూ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారు చేయడానికి పెరుగు దోహదపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పర్చడంలోనూ పెరుగు ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఒక కప్పు పెరుగు తింటే మీ శరీరానికి 300 మి.గ్రా వరకు కాల్షియం లభిస్తుంది.

కాటేజ్ చీజ్ :
పాలతో తయారు చేసిన పనీర్‌లో సోడియం, కాల్షియం, ప్రోటీన్, జింక్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. అందుకే పనీర్ తినడం వల్ల ఎముకలు బలంగా మారటమే కాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌తో 42 శాతం కాల్షియం లభిస్తుంది. 

బాదాం :
బాదాం పప్పు చాలా ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. రోజూ ఒక పిడికెడు బాదం పలుకులు తింటే మీ ఒంటికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఒక 30 గ్రాముల బాదాం పప్పులో 76 మి.గ్రా క్యాల్షియం లభిస్తుంది అని న్యూట్రిషనల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. బాదాంలో కాల్షియంతో పాటు విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు బాదం పలుకులు తింటే ఎముకలు దృఢంగా అవడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.  

ఇది కూడా చదవండి : Control Blood Sugar Levels With Tea: కప్పు ఈ టీతో ఎంతటి మధుమేహమైనా దిగిరావడం ఖాయం!

సోయా పాలు :
కొంతమంది ఆవు పాలు లేదా గేదె పాలు తాగడానికి అంతగా ఇష్టపడరు. అలా పాలు తాగే అలవాటు లేకపోవడం వల్ల కూడా అలాంటి వారికి క్యాల్షియం లోపం ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే వాళ్లు సోయా పాలు తాగితే కాల్షియం లోపం రాకుండా ఉంటుంది. సోయా పాలలో కేవలం క్యాల్షియం మాత్రమే కాకుండా ప్రోటీన్, ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి సైతం సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి : Vegetarian Protein Diet: మాంసాహారాల్లోనే కాకుండా ఈ ఆహారాల్లో కూడా ప్రోటీన్స్‌ మెండుగా లభిస్తాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News