Bombay Rava Idli Recipe In Telugu: ఇడ్లీ ఒక ప్రసిద్ధ దక్షిణ భారత వంటక. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన వంటకం. దీనిని బియ్యం, మిరప గుండ్ల పిండితో తయారు చేస్తారు. దీనిని 1వ శతాబ్దం నుంచి ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారని పూరాణాల్లో పేర్కొన్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యాపారులు దీనిని భారతదేశానికి పరిచయం చేశారని కొందరు చరిత్రకారులు నమ్ముతారు. ఈ రెసిపీకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. పిల్లల నుంచి పెద్దవారి దాకా ఎంతో ఇష్టంగా తినే ఈ ఇడ్లీలను ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తయారు చేసుకుంటారు. చాలా మంది దీనిని బియ్యం, మినుముల పిండితో తయారు చేసుకుంటే, మరికొంతమంది ఓట్స్ పిండి, బొంబాయి రవ్వతో తయారు చేసుకుంటారు. అయితే ఈ రోజు కొత్తగా బొంబాయి రవ్వతో ఎలా ఇడ్లీలను తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బొంబాయి రవ్వ ఇడ్లీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - 1 కప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
శెనగపప్పు - 2 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీడిపప్పులు - 10
అల్లం ముక్క - 1 (తరిగిన)
పచ్చిమిరపకాయ - 1 (తరిగిన)
కరివేపాకులు - తరిగినవి
ఇంగువ - 1/4 టీస్పూన్
పెరుగు - 1/2 కప్పు
నీళ్లు - 1/4 కప్పు
ఉప్పు - 1 టీస్పూన్
వంట సోడా - 1/4 టీస్పూన్
కొత్తిమీర - తరిగిన
తయారీ విధానం:
బొంబాయి రవ్వ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా బొంబాయి రవ్వ కోసం ఓ బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ బౌల్‌లో బొంబాయి రవ్వ వేసుకుని స్టౌవ్‌పై పెట్టుకుని ఒక నిమిషం పాటు వేయించాల్సి ఉంటుంది.
ఇలా వేయించిన రవ్వను బాగా చల్లార్చుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఒక వెడల్పాటి పాన్‌లో నెయ్యి వేసి అందులో శెనగపప్పు, ఆవాలు, జీడిపప్పులు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, ఇంగువ వేసి వేయించి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఈ మిశ్రమంలో వేయించిన రవ్వను వేసి కలిపి చల్లారనివ్వాలి.
చల్లారిన రవ్వ మిశ్రమంలో పెరుగు, నీళ్లు, వంట సోడా, కొత్తిమీర వేసి బాగా కలిపి పది-పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఇలా నానబెట్టి మిశ్రమాన్ని బాగా రుబ్బుకోని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇడ్లీ రేకుల మీద కొద్దిగా నూనె రాసి, అందులో ఇడ్లీ పిండిని వేసుకోవాలి.
ఇడ్లీలను ఆవిరి మీద కనీసం ఏడు నిమిషాలు ఉడికించాలి.
అంతే రుచికరమైన బొంబాయి రవ్వ ఇడ్లీలు తయారైనట్టే..
వీటిని సాంబార్, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీలతో సర్వ్ చేసుకుని ఆస్వాదించండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చిట్కాలు:
రుచి కోసం ఇడ్లీ పిండిలో కొన్ని తరిగిన కూరగాయలు లేదా కరివేపాకులు కూడా వేయవచ్చు.
ఇడ్లీలను మరింత మెత్తగా చేయడానికి పెరుగును వేసుకుని ముందుగా రాత్రంతా నానబెట్టవచ్చు.
ఇడ్లీలను తయారు చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో నీరు ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త వహించండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి