Black Tea Side Effects In Telugu: ప్రస్తుతం చాలామంది ఉదయం లేవగానే పాలతో తయారు చేసిన టీ లేదా కాఫీతో రోజును ప్రారంభిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఛాయి లేదా కాఫీ తాగే వారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఒక్కొక్క రాష్ట్రం వారు ఒక్కొక్కటిని ఆస్వాదిస్తూ ఉంటారు. కొంతమంది బ్లూ టీ తాగితే మరి కొంతమంది అయితే గ్రీన్ టీ, బ్లాక్ టీ, మిల్క్ టీ ఇలా వివిధ రకాల టీలను తాగుతూ ఉంటారు. ఆధునిక జీవనశైలిలో టీ అనేది దినచర్యలో భాగం అయిపోయింది. అయితే చాలామంది ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో టీని తాగొద్దని అంటూ ఉంటారు. మరి కొంతమందైతే ఉదయం పూటనే టీ తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారని చెప్పుకుంటారు.
నిజానికి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువ చక్కెర వేసి తయారుచేసిన పాలతో తయారు చేసిన టీని తాగడం అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చాయ్‌కి బదులుగా ఎక్కువగా బ్లాక్ టీని తాగేవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఖాళీ కడుపుతో తాగకూడదని వారంటున్నారు. అయితే పరిగడుపున బ్లాక్ టీని తాగడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో.. ఎందుకు తాగకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగడం వల్ల రోజు తాగే సాధారణ అంటే ఈ కంటే మన శరీరంలో ఎక్కువగా కెఫిన్ వచ్చి నిల్వ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలా ప్రతిరోజూ శరీరంలో కెఫిన్ అధిక మోతాదులో పెరగడం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలామందిలో ఇలా బ్లాక్ టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఇందులో ఉండే కెఫెన్ మన జీర్ణ క్రియను దెబ్బతీసే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే కొంతమందిలో దీని కారణంగా ఎముకల బలహీనత వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఉదయం పూట అతిగా ఖాళీ కడుపుతో బ్లాక్ టీ ని తాగడం మానుకోవాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
చాలామందిలో ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగడం వల్ల మెదడు నరాల్లో మార్పులు వచ్చి డిప్రెషన్ వంటి సమస్యలు కూడా వస్తున్నారు. దీంతో పాటు శరీరంలోని ద్రవాలన్నీ బయటకు పోయే ఛాన్స్ కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎండాకాలం ఖాళీ కడుపుతో ఈ టీ ని తాగితే తొందరగా ఎండ దెబ్బకు గురవుతారు. మరికొంతమందిలోనైతే కిడ్నీలో పై భారీ ఎఫెక్ట్ చూపి అనేక సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కొంతమందిలో ఈ టీ తాగడం వల్ల శరీర బలహీనత కూడా వస్తోంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే టీ తాగాలనుకునేవారు ఖాళీ కడుపుతో కాకుండా ఏమైనా ఆహారాలు తీసుకొని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా బ్లాక్ టీను ఎక్కువగా మరిగించకుండా తీసుకోవడం చాలా మంచిది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి