Black Cardamom Benefits Ayurveda: భారతీయులు అతిగా వినియోగించే మసాలా దినుసులు యాలకులు కూడా ఒకటి. ఇవి చూడడానికి చిన్నవిగా.. చక్కటి సువాసనను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వీటిని భారతీయులు ఆహార రుచిని పెంచేందుకు ఎక్కువగా మసాలా పొడిలో భాగంగా వీటిని వినియోగిస్తారు. ఇదే కాకుండా స్వీట్ల రుచిని రెట్టింపు చేసేందుకు కూడా యాలకుల పొడిని వాడతారు. అయితే ఇవి నోటికి రుచి అందించడమే కాకుండా శరీరాన్ని కూడా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామందికి బయట లభించే సాధారణ యాలకుల గురించి తెలిసి ఉంటుంది. కానీ మార్కెట్లో నల్ల యాలకులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలతో పాటు ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని ప్రతిరోజు వినియోగించడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల యాలకుల వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటితో తయారుచేసిన టీ ని తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది అంతేకాకుండా పొట్ట సమస్యలు అయిన మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలనుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా గొంతు నొప్పి దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ టీ ని తాగడం వల్ల రిలీఫ్ పొందుతారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు.
Also read: RS Praveen Kumar: ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రతిరోజు నలయాలకులను ఆహారంలో వినియోగించడం వల్ల శరీర నొప్పులు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంపై వచ్చే వాపులను తగ్గించేందుకు కూడా ఔషధ మూలకంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట గ్రీన్ టీ లో భాగంగా నల్ల యాలకుల తో తయారుచేసిన పొడిని మిక్స్ చేసుకొని తాగడం వల్ల ఫ్రీరాడికల్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు నల్ల యాలకులతో తయారు చేసిన ఆహారాలను వినియోగించాల్సి ఉంటుంది.
ప్రతిరోజు నల్ల యాలకుల తో తయారు చేసిన టీని తాగడం వల్ల నోటి నుంచి దుర్వాసన రావడం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ టీ ని ప్రతిరోజు తాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఈ టీ లో ఉండే ఔషధ గుణాలు రక్త ప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుచుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడేవారు నల్ల యాలకులను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది.
Also read: RS Praveen Kumar: ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook