Difference Between Cow Ghee & Buffalo Ghee: నెయ్యి శరీరానికి చాలా అవసరం నెయ్యిలో శరీరాన్ని కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని ఆయుర్వేద నిపుణులు క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తారు. అయితే చాలామంది నెయ్యి తినడం వల్ల లావు అవుతారని అనుకుంటారు. ఇలా అనుకుంటే పొరపాటే నెయ్యి తినడం వల్ల బరువు పెరగడం వంటి సమస్యలు అసలు ఉత్పన్నం కావు.. అయితే ఏ నెయ్యిని తీసుకోవడం వల్ల బరువు పెరగడం వంటి సమస్యలు బారిన పడతారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.. సహజంగా మనకు మార్కెట్లో రెండు రకాల నెయ్యులు లభిస్తున్నాయి. ఒకటి ఆవు నెయ్యి అయితే.. రెండోది గేదె నెయ్యి. అయితే ఏమి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారో.. ముఖ్యంగా ఈ రెండు నెయ్యల వల్ల కలిగే ప్రయోజనాలను మనం తెలుసుకోబోతున్నాం..
ఆవు నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఆవు నెయ్యిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు విటమిన్లు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఏ, ఈ, డి, కె లు లభిస్తాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే వృద్ధాప్యాన్ని, క్యాన్సర్లను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఆంటీ యాక్సిడెంట్ లో పరిమాణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని దృఢంగా చేసేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది.
గేదె నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గేదె పాలు క్రమం తప్పకుండా తీసుకుంటే ఊబకాయం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇప్పటికే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ నెయ్యిని తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సన్నగా ఉంది బరువు పెరగాలనుకుంటున్నారు. తప్పకుండా గేదె నెయ్యిని తీసుకోవాలి. ఈ నెయ్యిలో కొవ్వు పరిమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా విటమిన్లు ఖనిజాలు లభిస్తాయి. బరువు పెరగాలనుకునేవారు ఈ నెయ్యిని తీసుకోవాలి.
Read Also: TRS VS MIM: పీకే బాటలోనే ఎంఐఎం.. కేసీఆర్ తో దోస్తీ కటీఫ్! 30 నియోజకవర్గాల్లో కారుకు గండం..
Read Also: Telangana Rain Alert : తెలంగాణలో మరో వారం కుండపోతే.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.