Diabetes Control Food: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం చాలా మంది భారత్‌లో మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే ఈ మధుమేహం బారిన ఒక్క సారి పడితే అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. దీని కారణంగా చాలా మందిలో కిడ్నీ వ్యాధి, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మధుమేహం రావడానికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారంలో అనారోగ్యకరమైన పదార్థాలు ఉండడం. అంతేకాకుండా జన్యు పరంగా కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి తప్పకుండా ఆహారంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
1. తగినంత నిద్ర పొందకపోవడం:
మధుమేహంతో బాధపడుతున్న వారు కచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. ఒక వేళా నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు నిద్ర పోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సక్రమంగా నిద్రపోతేనే హార్మోన్ల ప్రభావం తగ్గుతుంది. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా నిద్రపోవాల్సి ఉంటుంది.
2. బ్రేక్ ఫాస్ట్ స్కిప్:
చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నవారు బ్రేక్ ఫాస్ట్‌ను తీసుకోవడం మానుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల రక్త పోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా టిఫిన్స్ చేయాల్సి ఉంటుంది.
3. రాత్రి భోజనం:
ప్రస్తుతం చాలా మంది రాత్రి పూట భోజనంలో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. రాత్రి పూట అస్సలు చిప్స్, స్నాక్స్ తినకూడదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక వేళా తింటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలా మందిలో రాత్రి పూట అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా రాత్రి డ్రై ఫ్రూట్స్ తీసుకున్న మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు
Also Read: Harish Rao: ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందన్న మంత్రి హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Diabetes Control Food: ఈ చిన్ని చిట్కాతో మధుమేహానికి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు.. తప్పకుండా ట్రై చేయండి..