Sunlight: రోజు ఉదయం ఇలా 5 నిమిషాలు ఎండలో కూర్చుంటే మానసిక సమస్యలన్నీ చెక్‌!

Benefits Of Sitting In Suunlight: రోజు ఉదయం పూట ఐదు నిమిషాల పాటు ఎండలో కూర్చోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మానసిక సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2024, 05:36 PM IST
Sunlight: రోజు ఉదయం ఇలా 5 నిమిషాలు ఎండలో కూర్చుంటే మానసిక సమస్యలన్నీ చెక్‌!

Benefits Of Sitting In Suunlight: ప్రతి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రోజుంతా కష్టపడి పని చేసేవారు తప్పకుండా ఉదయం పూట సూర్యరశ్మిలో కొద్దిసేపైనా గడపడం చాలా అవసరం. ఎందుకంటే ఉదయం పూట సూర్యుడి కాంతి నుంచ వచ్చే కిరణాల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా శరీరానికి కొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ప్రతి రోజు ఐదు నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకోండి. 

ప్రతి రోజు ఉదయం పూట 5 నిమిషాల పాటు సూర్య కిరణాలు శరీరంపై పడితే..శరీరంలోని సెరోటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా రోజంతా ఎంతో ఉత్సహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు మానసిక సమస్యలు కూడా దూరమవుతాయని వారంటున్నారు. అంతేకాకుండా నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని కూడా ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

తరచుగా రాత్రి నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఉదయం పూట సూర్య కిరణాలు పడే చోట కూర్చొవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రాత్రిపూట నిద్ర కూడా తేలికగా పడుతుంది. దీంతో పాటు సిర్కాడియన్ రిథమ్‌ను కూడా మెరుగుపరుచుతుంది. ఈ సూర్యకాంతి నుంచి విటమిన్ డి కూడా పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ఏకాగ్రత పెరుగుతుంది:

ప్రతిరోజూ ఉదయం ఐదు నిమిషాల పాటు సూర్యకాంతిలో కూర్చుకోవడం వల్ల  మైండ్ ఫ్రెష్‌గా మారుతుంది. దీంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అన్‌ మూడీ సమస్యలతో బాధపడేవారు ఇలా ప్రతి రోజు సూర్యకాంతిలో కూర్చుంటే మూడ్ కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు మెదడు మరింత స్పష్టంగా, వేగంగా పనిచేస్తుంది. కాబట్టి తరచుగా మానిక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News