Biryani Leaves: మూత్ర సమస్యలకు చెక్ పెట్టడంలో బిర్యానీ ఆకు!

Biryani Leaves Benefits: బిర్యానీ ఆకును మనం తరచుగా బిర్యానీ చేయడంలో ఉపయోగిస్తాం. వీటిని ఎక్కువగా మసాలా దినులసు కనిపిస్తాయి. అయితే ఈ ఆకును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఏంతో మేలు కలుగుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2024, 05:13 PM IST
Biryani Leaves: మూత్ర సమస్యలకు చెక్ పెట్టడంలో బిర్యానీ ఆకు!

Biryani Leaves Benefits: బిర్యానీ ఆకు కేవలం వంటలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  ఈ ఆకును తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణుల చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ తగ్గిస్తుంది.  

బిర్యానీ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మినరల్స్‌, ఫైబర్‌ వంటి గుణాలు శరీరానికి లభిస్తాయి. బిర్యానీ ఆకులు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తొలుగుతాయి. అలాగే జీర్ణ సమస్యలు, అంటువ్యాధులు, మూత్రవిసర్జన సమస్యలకు నుంచి ఉపశమనం పొందవచ్చు.

బిర్యానీ ఆకు కడుపు నొప్పి, ఊపిరితిత్తులతో ఉండే కఫం, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్ , నరాల నొప్పి చికిత్సలో కూడా ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

బిర్యానీ ఆకులను ముక్కు కింద లేదా తలపై పట్టుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ డయేరియా , యాంటీ డయాబెటిక్ లక్షణాలు బిర్యానీ ఆకులలో పుష్కలంగా లభిస్తాయి. బిర్యానీ ఆకు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. 

Also Read: Foods Lead Kidney Stones: కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు ఇవి తినకూడదు!

→ బిర్యానీ ఆకులలో ఉండే రసాయన తీసుకోవడం వల్ల కడుపు నొప్పికి , ప్రేగు సిండ్రోమ్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

→ ఆహారాన్ని జీర్ణం చేయడంలో బిర్యానీ ఆకులు ఏంతో  సహాయపడతాయి.

→ అంతేకాకుండా  బిర్యానీ ఆకుల్లో ఐరన్‌, కాల్షియం, విటమిన్‌-కె పుష్కలం లభిస్తాయి. ఇవి ఎముకల దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.

→ రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను అదుపు చేస్తుంది.

→ రక్తపోటును అదుపులో ఉంచడంలో బిర్యానీ ఆకు సహాయపడుతుంది. 

→ జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది బిర్యానీ ఆకులు.

→ ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలను బిర్యానీ ఆకు తగ్గిస్తుంది.

→ కీళ్లవాపులు, కండరాల నొప్పులను తగ్గించడానికి  బిర్యానీ రసం ఎంతో ఉపయోగడుతుంది.

→ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. 

→ కంటిచూపుతో పాటు చర్మ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

Also Read: Dating Mistakes: మీరూ పెళ్లైన వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారా? అయితే ఈ పరిణామాలకు కూడా సిద్ధంగా ఉన్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News