Ageing Process: యౌవ్వనంలోనే వృద్ధాప్యం కన్పిస్తోందా..ఆ అలవాట్లు మానితే చాలు

Ageing Process: వయస్సుతో పాటు వృద్ధాప్యఛాయలు సహజమే కానీ..కొన్ని మార్పులు, చిట్కాలతో వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 30, 2022, 09:09 PM IST
Ageing Process: యౌవ్వనంలోనే వృద్ధాప్యం కన్పిస్తోందా..ఆ అలవాట్లు మానితే చాలు

Ageing Process: వయస్సుతో పాటు వృద్ధాప్యఛాయలు సహజమే కానీ..కొన్ని మార్పులు, చిట్కాలతో వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..

ఆధునిక పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా తక్కువ వయస్సులోనే వృద్ధాప్యపు ఛాయలు ముఖంలో కన్పిస్తున్నాయి. 30-40 ఏళ్లకే 50 పైబడినట్టు కన్పిస్తున్నారు. మనం చేసే తప్పులే దీనికి కారణం. చాలా సాధారణమైన మార్పులతో ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడుకోవచ్చు. తగిన జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా ఏజీయింగ్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.

బ్లూ స్క్రీన్స్‌కు దూరం

అన్నింటికంటే ముఖ్యంగా బ్లూ స్క్రీన్స్ చూడటమనేది చాలావరకూ తగ్గించుకోవాలి. బ్లూ లైట్ ఎక్కువగా కళ్ల మీద పడటం వల్ల వయస్సు పెరిగినట్టు కన్పిస్తుంది. కంప్యూటర్ స్క్రీన్స్, ఫోన్ స్క్రీన్స్‌కు సాధ్యమైనంత దూరంలో ఉండాలి. 2019లో ప్రచురితమైన ఏజింగ్ అండ్ మెకానిజమ్స్ ఆఫ్ డిసీజ్ జర్నల్‌లో ఈ విషయాలున్నాయి. ఎక్కువ సేపు బ్లూ స్క్రీన్స్ చూడటం వల్ల మెదడు, కళ్లలోని కణాలు దెబ్బతింటాయని తెలుస్తోంది. అందుకే సహజకాంతి మంచిదని..స్క్రీన్ టైమ్ తగ్గించుకుంటే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. 

చర్మ సంరక్షణకు సంబంధించి మాయిశ్చరైజర్. చాలామంది మాయిశ్చరైజర్ వాడరు. దాంతో ఏజియింగ్ ముందుగా కన్పిస్తుంది. మాయిశ్చరైజర్ వల్ల చర్మంలో నీటిశాతం పెరిగి..చర్మం కాంతివంతంగా మారుతుంది. అందుకే మాయిశ్చరైజర్ అలవాటు చేసుకుంటే మంచిది. సరైన నిద్ర లేకపోవడం కూడా ప్రధాన కారణం. క్లినికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ డెర్మటాలజీ ఆర్టికల్ ప్రకారం కావల్సినంత నిద్ర ఉండే మహిళల్లో 30 శాతం మందికి ముసలితనమే కన్పించదట. రోజుకు 7 గంటల నిద్ర మనిషికి తప్పనిసరి. 

చెడు అలవాట్లలో మద్యం తాగడం, సిగరెట్ స్మాకింగ్ కూడా దీనికి కారణాలే. ఈ రెండు అలవాట్లు ఉన్నవారిలో ముసలితనం త్వరగా కన్పిస్తుంది. ఎందుకంటే ఆల్కహాల్ అనేది చర్మాన్ని పూర్తిగా డీహైడ్రేట్ చేస్తుంది. ముడతలు, ఎర్రగా మారడం, కళ్లు వాసినట్లుంటడటం ప్రధానమైన సమస్యలు. కేన్సర్, హార్ట్ డిసీజ్ తగ్గించుకోవాలంటే మోతాదుకు మించి తాగకపోవడమే మంచిది. ఇక తీపి కూడా తక్కువగా తినడం మంచిది. ఎక్కువగా తీసుకుంటే కార్పొహైడ్రేట్స్ వయస్సు ఎక్కువ కన్పించేలా చేస్తుంది. చర్మంపై ముడతలు ఎక్కువవుతాయి. అటు పండ్లు కూడా బాగా పండకుండా దోరగా ఉండేవి తినడం మంచిది. 

Also read: Throat Allergies: గొంతు ఎలర్జీ వంటి సీజనల్ సమస్యకు ఇలా చెక్ పెట్టండి చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News