Anti Ageing Tips: ఇటీవలి కాలంలో నలభై ఒడిలోనే అరవై లక్షణాలు కన్పించడం ఎక్కువైపోయింది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, కాలుష్యం ఇలా రకరకాల కారణాలు ఏజీయింగ్‌కు కారణమౌతున్నాయి. వయస్సు మీరకుండానే వృద్ధాప్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తూ ఇబ్బంది కల్గిస్తోంది.
అందుకే వయస్సు నలభై దాటకుండానే అరవై లక్షణాలు పెరుగుతున్నాయి. ముఖం వడలిపోవడం, ముడతలు పడటం, చర్మం నిగారింపు కోల్పోయి నిర్జీవంగా మారడం వంటి సమస్యలు సాధారణమయ్యాయి. అయితే ఈ సమస్యకు కొన్ని హోమ్ రెమిడీస్ అంటే చిట్కాలతో అద్బుతంగా పరిష్కరించుకోవచ్చంటున్నారు. చింతపండు ఫేస్‌ప్యాక్ ఈ సమస్యకు సమాధానమంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ ఫేస్‌ప్యాక్ ద్వారా ముఖంపై ముడతలు పోయి..వయస్సు పదేళ్లు తగ్గినట్టు కన్పిస్తారు. సదా యౌవనంగా ఉంటారు. చర్మానికి నిగారింపు రావడంతో ముఖం కళకళలాడుతుంది.
చింతపండు అందరికీ తెలిసిందే. ప్రతి వంటింట్లో లభించే చింతపండుకు పులుపెక్కువ. పుల్లగా ఉన్నా రుచిగా ఉండటం దీని ప్రత్యేకత. ఇలాంటి చింతపండుతో హెల్తీ అండ్ ఫెయిర్ స్కిన్ మీ సొంతం చేసుకోవచ్చు. చింతపండుతో చేసే ప్రత్యేకమైన ఫేస్‌ప్యాక్ ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖంపై ముడతలు పొగొట్టి, మచ్చల్లేకుండా చేస్తుంది. చింతలో ఉండే హైడాక్సీ యాసిడ్, విటమిన్ సి ఇందుకు దోహదమౌతాయి. డెడ్ స్కిన్ తొలగించి చర్మానికి కాంతిని అందిస్తుంది.
చింతపండు ఫేస్‌ప్యాక్ తయారీ
చింతపండు ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు 2 చెంచాల చింతపండు గుజ్జు, 1 చెంచా ముల్తానీ మిట్టీ, 1 చెంచా అలోవెరా జెల్ అవసరమౌతాయి. ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నీరు వేసి చింతు పండు గుజ్జు కరిగించాలి. ఆ తరవాత ఈ నీళ్లను బాగా వడకాచి మరో గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడీ నీళ్లలో ముల్తానీ మిట్టీ, అలోవెరా జెల్ కలపాలి. చివరిగా అన్నింటినీ బాగా కలపాలి. అంతే మీకు కావల్సిన చింతపండు ఫేస్‌ప్యాక్ సిద్ధమైనట్టే.
చింతపండు ఫేస్‌ప్యాక్ ముఖానికి రాసే ముందు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని తుడుచుకుని చింతపండు ఫేస్‌ప్యాక్ బాగా అప్లై చేయాలి. దాదాపు 15-20 నిమిషాలుంచి..సాధారణ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండుసార్లు ఇలా చేస్తే చాలు, మీ చర్మం నిగనిగలాడుతుంది. ముఖంపై ముడతలు పోయి..నిత్య యౌవనం సొంతమౌతుంది. చర్మం కళకళలాడుతుంది కూడా.
Also read: Weight Loss Tips: జామాకులతో అధిక బరువుకు చెక్, నిజానిజాలేంటి, ప్రయోజనాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook