Banana Benefits In Winter Season: మనం మనం ప్రతిరోజు ఎక్కువగా తినే పనులలో అరటి పండ్లు ఒకటి వీటిని మనం సాయంత్రం లేదా మధ్యాహ్నం సమయంలో తింటూ ఉంటాం. ఇవి నోటికి రుచిగా ఎంతో తియ్యగా ఉండడంతో చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అంతేకాకుండా ఇవి అన్ని కాలాల్లోనూ మార్కెట్లలో లభిస్తూ ఉంటాయి. అరటి పండ్లలో శరీరానికి కావాల్సిన పొటాషియం మెగ్నీషియం ఫైబర్ క్యాల్షియం తగిన మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు తినడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది అంతేకాకుండా బాడీకి తక్షణమైన శక్తి లభిస్తుంది.
అరటి పండులో అధిక పరిమాణంలో క్యాల్షియం కూడా లభిస్తుంది కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి దీంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చలికాలంలో చాలామందికి వేడిగా ఉండే ఆహారాలు నోటికి ఘాటుగా అనిపించే పదార్థాలను తీసుకోవాలని కోరిక కలుగుతుంది.
కానీ చాలామందికి ఈ సమయంలో అరటిపండును తినాలని కోరిక మాత్రం కలగదు. ఎందుకంటే శీతాకాలంలో అరటి పనులను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. చలికాలంలో ఎక్కువగా అరటి పండ్లను తినడం వల్ల దగ్గు, జలుబుతో పాటు కఫం వంటి సమస్యలు వస్తాయని చాలామంది భయపడుతూ ఉంటారు.
కానీ వైద్యులు మాత్రం చలికాలంలో ప్రతిరోజు అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల చలి కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుందని అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని వారు అంటున్నారు. ముఖ్యంగా జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు చలికాలంలో అరటిపండును తీసుకోవడం వల్ల అందులో ఉన్న ఫైబర్ అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter