Ayurvedic Hair Care Tips: జీవనశైలి మారడం వల్ల చాలామందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే చాలా రకాల ప్రొడక్ట్స్ ని వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే కింద పేర్కొన్న ఈ ఆయుర్వేద చిట్కాలను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిగ్నులు చెబుతున్నారు ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టు రాలడం నివారించడానికి ఆయుర్వేద చిట్కాలు:
మెంతులతో తయారు చేసిన నూనె:
మెంతుల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి అందుకే వీటిని ఆహారాల్లో వినియోగిస్తారు. జుట్టు రాలకుండా ఉండడానికి తప్పకుండా వీటితో తయారుచేసిన నూనె వినియోగించాలి. అయితే దీనికోసం ముందుగా కొబ్బరి నూనెను తీసుకొని దానిని వేడి చేసి అందులో రెండు స్పూన్ల మెంతి గింజలను వేయాలి. ఆ తర్వాత ఆ నూనెను వడకట్టి రాత్రి పడుకునే ముందు తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి.
ఉసిరి:
ఉసిరిలో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి ముఖ్యంగా ఇవి డయాబెటిస్తో బాధపడుతున్న వారికి ప్రభావంతంగా సహాయపడతాయి. జుట్టు సమస్యలను కూడా నియంత్రించేందుకు సహాయపడతాయి. దీనికోసం మార్కెట్లో లభించే వీటి పొడిని తీసుకొని.. ఆ పొడిలో టీ స్పూన్ నిమ్మరసం జోడించి మిశ్రమంల తయారు చేసుకొని జుట్టుకు అప్లై చేయాలి. 25 నిమిషాల తర్వాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి.
కొబ్బరి నూనె:
కొబ్బరిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి కొబ్బరిని జుట్టు సమస్యలకు కూడా వినియోగించవచ్చు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టును కుదుళ్ళ నుంచి దృఢంగా చేస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా దీనితో తయారు చేసిన నూనెను వినియోగించవచ్చు.
Also Read: Dussehra 2022: దసరా రోజు ఆయుధ పూజలో భాగంగా ఇలా చేయండి.. మీరు కోరిన కోరికలు తీరుతాయి..
Also Read: Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook