Dhanteras: ఆ రెండు గంటల సమయంలో ఈ వస్తువుల కొనండి.. లైఫ్ గ్రాఫ్ చేంజ్ అవ్వడం ఖాయం

Dhanatrayodashi: సనాతన హిందూ ధర్మం ప్రకారం మనం ప్రతిరోజు చేసే పూజలకు ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అందుకే ప్రత్యేకమైన కొన్ని రోజులలో కొన్ని రకాల వస్తువులను కొనడం వల్ల ఇంటికి అదృష్టం వస్తుంది అని భావిస్తారు. ధన త్రయోదశి నాడు ఎటువంటి వస్తువులు ఏ సమయంలో కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2023, 10:28 PM IST
Dhanteras: ఆ రెండు గంటల సమయంలో ఈ వస్తువుల కొనండి.. లైఫ్ గ్రాఫ్ చేంజ్ అవ్వడం ఖాయం

Dhanteras: హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతినిత్యం మనం చేసుకునే పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.కొన్ని ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల ఇంటిలోని సకల అరిష్టాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి. ఒక్కొక్క పండగకు ఒక్కొక్క విశిష్టత ఉండడంతో పాటు కొన్ని రోజులలో కొన్ని రకాల వస్తువులు కొనడం వల్ల ఇంటికి మంచిది అని భావిస్తారు. అలా ధన త్రయోదశి నాడు బంగారు కొనడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అందరూ భావిస్తారు.

అయితే ధన త్రయోదశి నాడు ఎప్పుడూ..ఏ టైం లో.. ఎలా.. ఏ వస్తువు తీసుకోవాలి అని చాలామంది తికమక పడుతూ ఉంటారు. దీపావళికి ముందు వచ్చే త్రయోదశి.. ధన్వంతరి మహర్షి జన్మదినం కావడంతో .. ఆరోజు ధన్వంతరి జయంతి లేదా  ధన్‌తేరస్‌గా మనమందరం జరుపుకుంటాము.

ఈ సంవత్సరం నవంబర్ 10 వ తారీఖున ధన త్రయోదశి పర్వదినం మనము జరుపుకోబోతున్నాం. 

అయితే ఈసారి ధనత్రయోదశి నాడు రెండే రెండు గంటల సమయాన్ని శుభసమయం అని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో కొనుక్కున్న వస్తువుల వల్ల ఇంటికి శుభం కలుగుతుందట. మరి ఆ సమయం ఏమిటో తెలుసా? నవంబర్ 10 ..సాయంత్రం 5:45 నిమిషాల నుండి 7:45 నిమిషాల వరకు మధ్య ఉన్న రెండు గంటల సమయం శుభసమయంగా పండితులు చెబుతున్నారు. మీరు ఈ సమయంలో షాపింగ్ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. 

శక్తి కొద్దీ బంగారం లేక వెండి ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చు.అయితే కేవలం బంగారు వెండి మాత్రమే కాదు ఇంకా కొన్ని వస్తువులను కూడా ధన త్రయోదశి నాడు కొనడం వల్ల అదృష్టం మీ ఇంట తాండవిస్తుంది. ఆ రోజు చీపురు కొనడం కూడా ఎంతో శ్రేష్టం.. అలాగే మట్టి పాత్రలు కూడా కొనుగోలు చేయవచ్చు. మరింకెందుకు ఆలస్యం నవంబర్ 10న షాపింగ్ ముహూర్తానికి షాపింగ్ చేయడానికి రెడీ అయిపోయింది.

గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది.

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. డీఏ పెంపు కొత్త లెక్కలు ఇలా..!

Also read: Zee News-Matrize Opinion Poll: తెలంగాణపై జీ న్యూస్-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్‌.. బీఆర్ఎస్ హ్యాట్రిక్.. కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News