Afternoon Sleep Magic: పగటిపూట కునుకు ఒంటికి మంచిదేనా? ఇవి తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Afternoon Sleep Magic: పగటిపూట నిద్రపోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఎక్కువగా స్ట్రెస్ ఫీలయ్యేవారు తప్పకుండా పగటిపూట 15 నుంచి 20 నిమిషాల పాటు నిద్రపోవడం చాలా మంచిది. ఇలా నిద్రపోవడం వల్ల గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 1, 2024, 02:04 PM IST
Afternoon Sleep Magic: పగటిపూట కునుకు ఒంటికి మంచిదేనా? ఇవి తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Afternoon Sleep Magic: చాలామందికి పగటిపూట పడుకునే అలవాటు ఉంటుంది. వారెక్కడున్నా తప్పకుండా పగటిపూట 20 నుంచి 30 నిమిషాల పాటు పడుకుంటూ ఉంటారు. అయితే పగటిపూట పడుకోవడం అనేది అలవాటు మాత్రమే కాదని శరీరానికి ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు పగటిపూట పడుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడడమే కాకుండా శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని వారంటున్నారు. ప్రతిరోజు పగటిపూట పడుకోవడం వల్ల పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

పగటిపూట పడుకోవడం వల్ల కలిగే లాభాలు: 
మెదడుకు విశ్రాంతి లభిస్తుంది: 

పగటిపూట పడుకోవడం వల్ల మెదడు ఆరోగ్యవంతంగా తయారవుతుందట. అంతేకాకుండా దానికి కాస్త విశ్రాంతి కూడా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా స్ట్రెస్ తో పని చేసేవారు తప్పకుండా మధ్యాహ్నం పూట పడుకోవడం చాలా మంచిదని వారంటున్నారు. కొంతమందిలో పగటిపూట పడుకోవడం వల్ల ఆలోచన సృజనాత్మకత కూడా పెరుగుతుందట దీంతో పాటు మానసిక సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పడుకోవడం మంచిది.

జ్ఞాపక శక్తిని పెంచేందుకు: 
మధ్యాహ్నం పూట పడుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా సులభంగా పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు సమయం దొరికినప్పుడు మధ్యాహ్నం పూట 15 నుంచి 20 నిమిషాల పాటు పడుకోవడం వల్ల అద్భుతమైన శక్తిని పొందుతారు అలాగే మానసిక సమస్యల బారిన పడకుండా ఉంటారు అలాగే ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవారు లంచ్ టైం లో 15 నిమిషాల పాటు పడుకోవడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు అంతేకాకుండా అద్భుతమైన పరిజ్ఞానాన్ని పొందే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

రక్తపోటును తగ్గిస్తుంది: 
ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతి రోజు మధ్యాహ్నం పూట పడుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇలా పడుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తొలగిపోతాయట. కొంతమందిలోనైతే శరీరంలోని రోగ నిరోధక శక్తి కూడా పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా కొంతమందిలో రక్తపోటు పెరగడం తగ్గడం వంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా మధ్యాహ్నం పూట 20 నుంచి 30 నిమిషాల పాటు పడుకోవడం చాలా మంచిది.

మానసిక ఒత్తిడి తగ్గుతుంది: 
రోజంతా పనిచేసే అలిసిపోతూ ఉంటారు.. అయితే పడుకోవడానికి తగినంత సమయం దొరకదు. ఇలాంటి వారికి మానసిక ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది. అయితే పని సమయాల్లోనే టైం దొరికినప్పుడు 20 నుంచి 30 నిమిషాల పాటు పడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందట. దీని కారణంగా ఆందోళన ఇతర దీర్ఘకాలిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో పగటిపూట నిద్రపోవడం వల్ల సాయంత్రం చురుకుగా కూడా తయారవుతారు.

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News