Acne Scars Free Face: పుచ్చకాయలు తినేటప్పుడు గింజలను పడేస్తున్నారా?, ఈ గింజల ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

Acne Scars Free Face Cream: మొటిమలు, మచ్చలు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు పుచ్చకాయ గింజలతో తయారు చేసిన ఫేస్ మాస్కులు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 2, 2023, 07:57 PM IST
Acne Scars Free Face: పుచ్చకాయలు తినేటప్పుడు గింజలను పడేస్తున్నారా?, ఈ గింజల ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు!

Acne Scars Free Face Cream: పుచ్చకాయ అంటే అందరికీ ఎంతో ఇష్టం.. ఇది వేసవిలో మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తుంది. ఇందులో నీటి పరిమాణాలు అధికంగా లభిస్తాయి కాబట్టి వేసవిలో ఈ ఫ్రూట్ ని తినడం వల్ల శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా వేసవికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి కూడా పుచ్చకాయ కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే పుచ్చకాయలో ఉండే లోపలి గుజ్జే కాకుండా వాటి గింజలు కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గింజల్లో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని ఫేస్ మాస్కుల వినియోగించడం వల్ల కూడా సులభంగా ముఖంపై చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ గింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మ సమస్యలే కాకుండా పురుషులకు చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ముఖ్యంగా స్త్రీలకు అయితే చర్మాన్ని మెరిపించేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఫేస్ మాస్క్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

పుచ్చకాయ గింజల ఫేస్ మాస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

  1. ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజలు
  2. ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి
  3. ఒక టీ స్పూన్ పెరుగు
  4. ఒక టీ స్పూన్ రోజ్ వాటర్
  5. ఒక టీ స్పూన్ ఆర్గానిక్ తేనె

ఫేస్ మాస్క్ తయారీ పద్ధతి:

  • పుచ్చకాయ హెయిర్ మాస్క్ తయారీ చేయడానికి ముందుగా పుచ్చకాయ గింజలను పొడిలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పొడిలా తయారు చేసుకున్న గింజల పొడిని పక్కన పెట్టాలి.
  • ఇలా పక్కన పెట్టిన తర్వాత ఒక కప్పు తీసుకొని అందులో ఈ పొడిని ముల్తానీ మెట్టిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ రోజు వాటర్ కలిపి ఓ మిశ్రమం లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 
  • ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఐదు నిమిషాల తర్వాత తీసుకొని అందులో తేనెను కలిపి మళ్ళీ మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకుంటే ఫేస్ మాస్క్ తయారైనట్టే..

ఫేస్ మాస్క్ అప్లై చేసుకునే విధానం:

  • ముందుగా పుచ్చకాయ గింజలతో తయారు చేసుకున్న ఫేస్ మాస్క్ ని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 
  • ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ ఫేస్ మాస్క్ ని అప్లై చేసుకోవాలి. 
  • ఇలా అప్లై చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు మీ చేతులతో నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. 
  • ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు మీ ముఖానికి అలానే ఉంచి శుభ్రమైన నీటితో ముఖాన్ని కడుక్కుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు ఇతర చర్మ సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేదంలోని చెబుతున్నారు.
  • Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ  
  1. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

    ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

     ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

    TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News