Ancient toilet‌: జెరూసలెంలో 2,700 నాటి పురాతన టాయిలెట్‌.. ఎలా ఉందో తెలుసా?

Jerusalem: ఇజ్రాయెల్‌లో అతిపురాతన మరుగుదొడ్డిని గుర్తించారు పురావస్తు శాస్త్రవేత్తలు. జెరూసలెంలో జరిపిన తవ్వకాల్లో 2,700 సంవత్సరాల క్రితం నాటి అరుదైన టాయిలెట్‌ను కనుగొన్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 11:49 AM IST
  • 2700 ఏండ్ల నాటి పురాతన టాయిలెట్‌
  • జెరూసలెంలో గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్తలు
  • దీని కింద సెప్టిక్ ట్యాంకు కూడా ఉండటం విశేషం
Ancient toilet‌: జెరూసలెంలో 2,700 నాటి పురాతన టాయిలెట్‌.. ఎలా ఉందో తెలుసా?

Ancient toilet‌: జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్‌(Ancient toilet)ను ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాలలో బెరూసలేం(Jerusalem) ఒకటన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ అతి పురాతనమైన టాయిలెట్‌ ఫొటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ(Israel Antiquities Authority) విడుదల చేయడంతో పవిత్ర నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల క్రితం కూడా ప్రైవేటు బాత్‌రూమ్‌లు ఉండేవని తేలింది. ఆ టాయిలెట్‌ కింద లోతైన సెప్టెక్‌ ట్యాంక్‌(Septic tank) కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read: Viral Video: రెండు చక్రాలతో ఆటో నడిపాడు..గిన్నిస్ రికార్డు సాధించాడు..

పురాతన కాలంలో టాయిలెట్ క్యూబికల్ (toilet cubicle )నిర్మించడం చాలా అరుదైన విషయమని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అధికారి తెలిపారు. అప్పట్లో ధనవంతులు మాత్రమే ఇలాంటి మరుగుదొడ్లను వాడేవారని చెప్పారు. టాయిలెట్‌ కింద ఉన్న సెప్టిక్ ట్యాంకులో జంతువుల ఎముకలతో పాటు లభించిన పలు వస్తువల ఆధారంగా ఆ సమయంలో నివశించిన వ్యక్తుల జీవనశైలితో పాటు అప్పటి వ్యాధులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ విహార ప్రదేశంలో పెద్ద ఎస్టేట్ ఉన్న ప్రదేశంలో ఈ టాయిలెట్‌ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్‌ను అధికారులు పురావస్తు సదస్సులో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు, అయితే అది వీక్షించడానికి మాత్రమే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News