వర్క్ ఫ్రమ్ హోమ్.. ఈ టిప్స్ పాటిస్తే నో ప్రాబ్లమ్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలో పలు దేశాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. అయితే ఇంటి వద్ద నుంచి పని చేయడం అంత తేలికేమీ కాదు

Last Updated : May 12, 2020, 10:19 AM IST
వర్క్ ఫ్రమ్ హోమ్.. ఈ టిప్స్ పాటిస్తే నో ప్రాబ్లమ్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలో పలు దేశాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. అయితే ఇంటి వద్ద నుంచి పని చేయడం అంత తేలికేమీ కాదు. ఓవైపు ఆఫీసు నుంచి నేరుగా కాంటాక్ట్ లేకపోవడం, మరోవైపు ఏం మెయిల్ వస్తుందా, ఎలాంటి అప్‌డేట్ వినాల్సి వస్తుందోనని సైతం ఉద్యోగులు ఆందోళన చెందుతుంటారు. అదే సమయంలో ఇంట్లో పిల్లలు, కుటుంబసభ్యుల బాగోగులు సైతం చూడాల్సి ఉంటుంది. వీటన్నింటిని పక్కనపెడితే Work From Home చేస్తూ ఇబ్బందులకు గురికావొద్దంటూ కొన్ని టిప్స్ పాటించాలి.  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు

సంస్థ మెయిల్స్ తరచుగా చెక్ చేయాలి
మీ బాస్ లేక ఉద్యోగులతో తరచుగా సంపద్రింపులు జరగాలి. కంపెనీ ఈమెయిల్స్ చెక్ చేస్తుండాలి. మీ పని గురించి అప్ డేట్స్ తెలుసుకుంటే వర్క్ తేలిక అవుతుంది. కరోనా వైరస్ సంబంధిత సమాచారం మీకు అందిస్తారు. మీకు ఏమైనా సందేహాలుంటే ఆఫీసు సాయం తీసుకోవచ్చు.

కంపెనీ టూల్ కిట్స్ వినియోగించాలి
మీరు పనిచేస్తున్న ఆఫీసు వారు సమకూర్చిన ల్యాప్‌టాప్స్, మొబైల్స్, సిమ్ కార్డులు వాడటం ఉత్తమం. వీటి వల్ల వైరస్ అటాక్ నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్, వీపీఎన్, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది.

డివైజ్ అప్‌డేట్ చేయండి
ఇంటి వద్ద నుంచి పనిచేసే సమయాల్లో మీ మొబైల్, ల్యాప్‌టాప్స్ అన్ని రకాల సాఫ్ట్‌వేర్స్ అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి. వీటి వల్ల సైబర్ సెక్యూరిటీ సమస్యలు తలెత్తవు. మీ డాటాకు సెక్యూరిటీతో పాటు కొత్త ఫీచర్స్ మీ పనిని సులభతరం చేస్తాయి.

వీపీఎన్ టర్న్ ఆన్ చేయాలి
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) కచ్చితంగా అన్ చేసి ఉంచాలి. దీనివల్ల ఉద్యోగులు, కంపెనీ యాజమాన్యానికి మధ్య సెక్యూరిటీ కమ్యూనికేషన్ ఉంటుంది. సైబర్ క్రిమినల్స్ బారిన పడకుండా ఉద్యోగులకు ఊరటనిస్తుంది. కస్టమర్ డేటాతో పాటు కంపెనీ సమాచారం లీక్ అవ్వకుండా వీపీఎన్ కీలకపాత్ర పోషిస్తుంది.  దిల్ రాజు పెళ్లిపై కూతురు ఏమన్నారంటే!

కొత్త సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేయొద్దు
కంపెనీ మీకు అందించిన ఏదైనా సాఫ్ట్‌వేర్ సరిగా పనిచేయని పక్షంలో మీరు సొంతంగా కొత్త యాప్స్, టూల్స్ ఇన్‌స్టాల్ చేయవద్దు. దీని వల్ల సెక్యూరిటీ లేని యాప్ ఇన్‌స్టాల్ అయితే మీ వ్యక్తిగత సమాచారంతో పాటు కంపెనీ డేటా హ్యాకర్స్ చేతికి వెళ్తుంది. సంబంధిత కంపెనీ ఐటీ టీమ్‌కు విషయం చెబితే వారు మీ సమస్యను పరిష్కరిస్తారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News