Vaccination capacity: అలా చేస్తే రెండు నెలల్లో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ : విప్రో అజీమ్ ప్రేమ్ జీ

Vaccination capacity: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నడుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందనే ఆందోళన నేపధ్యంలో వ్యాక్సినేషన్ వేగం పుంజుకోవల్సిన అవసరమొచ్చింది. వ్యాక్సినేషన్ సామర్ధ్యం పెంచేందుకు విప్రో అజీమ్ ప్రేమ్ జీ ఇస్తున్న సూచనలేంటి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 23, 2021, 12:54 PM IST
  • దేశంలో వ్యాక్సినేషన్ సామర్ధ్యం పెరగాలంటే ప్రైవేటు భాగస్వామ్యం కల్పించాలి
  • ప్రైవేటు భాగస్వామ్యం చేస్తే 60 రోజుల్లో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అవకాశం
  • బెంగళూరులో జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో విప్రో ఫౌండర్ అజీమ్ ప్రేమ్ జీ
Vaccination capacity: అలా చేస్తే రెండు నెలల్లో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్ : విప్రో అజీమ్ ప్రేమ్ జీ

Vaccination capacity: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నడుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందనే ఆందోళన నేపధ్యంలో వ్యాక్సినేషన్ వేగం పుంజుకోవల్సిన అవసరమొచ్చింది. వ్యాక్సినేషన్ సామర్ధ్యం పెంచేందుకు విప్రో అజీమ్ ప్రేమ్ జీ ఇస్తున్న సూచనలేంటి..

భారతదేశంలో ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination)కార్యక్రమం నడుస్తోంది. మరోవైపు కరోనా వైరస్ నెమ్మదిగా పెరుగుతున్నట్టు కన్పిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ( Maharashtra)లో గణనీయంగా పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.  కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూల్స్ మూసివేశారు. షాపింగ్ మాల్స్, ధియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. సామాజిక దూరం, మాస్క్ ధరించడం వంటివాటిని కఠినంగా అమలు చేసేందుకు మార్షల్స్ రంగంలో దిగారు. మరోవైపు పరిస్థితి అదుపు రాకపోతే మరోసారి లాక్‌డౌన్( Lockdown)విధించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

ఈ తరుణంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పుంజుకోవల్సిన అవసరమేర్పడింది. వ్యాక్సినేషన్ సామర్ధ్యాన్ని పెంచేందుకు విప్రో (Wipro)వ్యవస్థాపకుడైన అజీమ్ ప్రేమ్ జీ ( Azim premji) విలువైన సూచనలు చేశారు. దేశంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచవచ్చని..బెంగళూరులో జరిగిన ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ చర్చలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ( Nirmala Sitaraman)కు తెలిపారు. తక్షణం ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి వ్యాక్సినేషన్ లో భాగస్వామ్యం కల్పిస్తే 50 కోట్లమంది ప్రజలకు 60 రోజుల్లోనే టీకా( 5o crore to be vaccinated in 60 days )ఇవ్వవచ్చన్నారు. ప్రైవేటు రంగం వల్ల వ్యాక్సినేషన్ రేటు భారీగా పెరుగుతుందని చెప్పారు. రికార్డు సమయంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను రూపొందించుకున్నామని..అదే సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum institute)నుంచి ఒక్కో వ్యాక్సిన్ డోసును 3 వందల రూపాయలకు పొందే అవకాశముందని..మరో వంద రూపాయలు కలుపుకున్నా..దేశవ్యాప్తంగా ఆసుపత్రులు, నర్శింగ్ హోమ్‌లలో 4 వందల రూపాయలకే వ్యాక్సిన్ ఇవ్వవచ్చని చెప్పారు. 

Also read: Bihar: ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం, మరికొందరి పరిస్థితి విషమం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News