ఆధార్ గడువు మార్చి 31 వరకు పొడిగింపు

పౌర సేవలకు ఆధార్ గడువును మర్చి 31వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.

Last Updated : Nov 27, 2017, 01:02 PM IST
ఆధార్ గడువు మార్చి 31 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ: పౌర సేవలకు ఆధార్ గడువును మర్చి 31వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.  2017, డిసెంబర్ 31 వరకు ఈ గడువును మరో మూడు నెలలు పొడిగించినట్టు సుప్రీం బెంచ్ కు వివరణ ఇచ్చింది. బెంచ్ లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎంకే ఖాన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్ సభ్యులుగా ఉన్నారు. వివిధ పథకాల ద్వారా లబ్దిపొందటానికి ఆధార్ ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆధార్ ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడానికి డిసెంబర్ 31, 2017 వరకు, మొబైల్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం చేయడానికి ఫిబ్రవరి 6, 2018 వరకు  గడువు ఉంది.

Trending News