Shocking Insudent in Kolkata Airport: మహిళలు, దివ్యాంగుల కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకు వస్తున్నాయి. వీరికి అన్నిరంగాలలో ఎలాంటి వివక్షలు లేకుండా ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక పథకాలను కూడా ఇప్పటికే అనేక రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే దివ్యాంగులను చిన్న చూపు చూస్తున్నారు. వీరికి అందించాల్సిన సదుపాయాలను పట్టించుకోవడంలేదు. ఇదిలా ఉండగా.. కోల్ కతా విమానాశ్రయంలో ఒక దివ్యాంగురాలు అరుషి సింగ్ కు ఘోర అవమానం ఎదురైంది. ఈ క్రమంలో ఆమె తాజాగా, తన ఎక్స్ ఖాతాలో తన ఆవేదనను పోస్ట్ చేసింది. దీంతో ఈ ఘటన కాస్త వైరల్ గా మారింది.
వెస్ట్ బెంగాల్ లోని కోల్‌కతా విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనను "లేచి నిలబడమని" అడిగారని ఓ వికలాంగ మహిళ ఆరోపించింది. సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో మూడుసార్లు లేచి నిలబడాల్సిందిగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది తనను అడిగారని అరుషి సింగ్ తన X ఖాతాలో పోస్ట్ చేసింది.
"నిన్న సాయంత్రం కోల్‌కతా విమానాశ్రయంలో సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో, అరుషి సింగ్ ను ఒక్కసారి కాదు మూడుసార్లు నిలబడమని అడిగారని ఆమె ఫిబ్రవరి 1న ఎక్స్‌లో రాసింది. "మొదట సిబ్బంది లేచి రెండు అడుగులు నడవాలని కోరినట్లు బాధితురాలు తెలిపింది. తనకు అంగవైకల్యం ఉన్నందున నేను చేయలేనని చెప్పింది. లోపలకూడా మరోసారి మళ్లీ నన్ను లేచి నిలబడమని చెప్పాగా, చేయలేనని చెప్పింది.
ఆతర్వాత కూడా ఇలానే లేచి నిలబడాల్సిందిగా కోరారని ఆవేదన వ్యక్తం చేసింది. పుట్టుకతో తనకు వైకల్యం ఉందని నేను మళ్లీ పూర్తిగా వివరించానని ఆమె X లో వెల్లడించింది. ఈ షాకింగ్ ఘటనతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని కూడా అరుషి సింగ్ తెలిపింది.
ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీకి సంబంధించిన CISF మాన్యువల్‌లో వైకల్యం ఉన్న వ్యక్తులను అవమానించేలా ప్రశ్నలు అడుగుతున్నారా అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దివ్యాంగులను అవమానించేలా ప్రవర్తించడం సరికాదని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ సిబ్బంది విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook