Heavy Rainfall in Gujarat: భారీ వర్షాలు గుజరాత్ ను అల్లకల్లోలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు మూడూ వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆపార్టుమెంట్ సెల్లార్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో మెటార్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. ఎడతెరిపి లేకుండాకురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ ఫోర్టులోకి భారీగా వరద నీరు చేరి రన్ వే సహా కారిడర్ మెుత్తం నీట మునిగింది.
సౌత్ గుజరాత్, సౌరాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు డ్యామ్ లన్నీ జలకళతో ఉట్టిపడుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ద్వారక, రాజ్ కోట్, వల్సద్, భావ్ నగర్ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో గుజరాత్ లో ఆరెంజ్ ను అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వరద పరిస్థితిపై ఎప్పుటికప్పుడు ఆరా తీస్తున్నారు సీఎం భూపేంద్ర పటేల్. సహాయం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. సహాయక బృందాలను పంపిస్తామని గృహమంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
This is the situation of Ahmedabad airport, #Gujarat after 28 years of BJP rule.
This is the model state of Narendra Modi.#GujaratRain pic.twitter.com/KpiwKu4AIq
— Deepak Khatri (@Deepakkhatri812) July 23, 2023
మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ రివర్ మరోసారి ప్రమాద స్థాయిని దాటింది. దీంతో దేశరాజధాని ఢిల్లీలో వరదలు వచ్చే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించారు. అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కారు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఇదే విషయంపై ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాతో అమిత్ షా చర్చలు జరిపారు. తాజా వరదల కారణంగా పంజాబ్ లో దాదాపు వెయ్యి కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు.
Also Read: Heavy Rains & Floods: దేశమంతా ఏకకాలంలో వరదలు, భారీ వర్షాలు, ఏయే రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
కుండపోత వర్షాలకు నీటమునిగిన అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు, వీడియో వైరల్