Violin maestro TN Krishnan passed away: చెన్నై: వయోలిన్ విధ్వాంసుడు, పద్మ అవార్డు గ్రహీత టీఎన్ కృష్ణన్ (92) కన్నుమూశారు. సోమవారం రాత్రి తమిళనాడు లోని చెన్నైలో తుదిశ్వాస విడిచారు. టీఎన్ కృష్ణన్ ( TN Krishnan) 1926 అక్టోబర్ 6వ తేదీన కేరళలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఆయన వయోలిన్ మేస్ట్రోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. త్రిప్పునితుర నారాయణయ్యర్ కృష్ణన్ (Trippunithura Narayanaiyer Krishnan) చిన్నప్పుడు తన తండ్రి ఎ.నారాయణ అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఆతర్వాత 11ఏళ్లకే తిరువనంతపురంలో వయోలిన్ కచేరిని నిర్వహించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.అయితే కృష్ణన్ వయోలిన్ విధ్వాంసుడిగానే కాకుండా ఉపాధ్యాయుడిగా రాణించారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యంతో సోమవారం రాత్రి తుదిశ్వాస (Violin maestro TN Krishnan passed away) విడిచారు.
Violin maestro and Padma awardee TN Krishnan (file pic) passed away in Chennai, Tamil Nadu at the age of 92 last evening. pic.twitter.com/xUq7j71Uaw
— ANI (@ANI) November 2, 2020
ఆ తర్వాత 1942 నుంచి ఆయన చెన్నైలో నివాసముంటున్నారు. చెన్నైలోని సంగీత కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్‌గా సేవలందించారు. వయోలిన్‌లో అందించిన సేవలకు గానూ.. మ్యూజిక్ అకాడమీకి చెందిన సంగీత కళానిధితో పాటు పద్మభూషణ్, పద్మ విభూషణ్ సహా పలు అవార్డులను టీఎన్ కృష్ణన్ అందుకున్నారు. Also read: Bihar Assembly Election 2020: రెండో దశ పోలింగ్ ప్రారంభం.. బరిలో తేజస్వీ
Bihar Assembly Election: వ్యాక్సిన్ ఉచితం సరైందే: ఈసీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe