కావేరి జల వివాదంపై తీర్పు నేడే..!

కొన్ని సంవత్సరాల పాటు నలిగిన కావేరీ జలవివాదంపై ఈ రోజే సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తోంది.

Last Updated : Feb 16, 2018, 11:05 AM IST
కావేరి జల వివాదంపై తీర్పు నేడే..!

కొన్ని సంవత్సరాల పాటు నలిగిన కావేరీ జలవివాదంపై ఈ రోజే సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తోంది. నీటి కేటాయింపుల కోసం 2007లో తొలిసారిగా కావేరి జలవివాద పరిష్కార ట్రిబ్యూనల్ అందించిన తీర్పును సవాలు చేస్తూ, తమిళనాడు , కర్ణాటకతో పాటు కేరళ ప్రభుత్వం కూడా వేరు వేరుగా సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశాయి.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల కమిటీ ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో 2017 సెప్టెంబరు 20న తీర్పును రిజర్వ్ చేసింది. అయితే అప్పటికే నీటి ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడుకి నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కోర్టు ఉత్తర్వులను కర్ణాటక పట్టించుకోకపోవడంతో ఆ రాష్ట్రంపై సుప్రీంకోర్టు తన ఆగ్రహాన్ని ప్రకటించింది.

ఈ క్రమంలో తమిళనాడు మరో వివాదంతో ముందుకు వచ్చింది. కేరళ రాష్ట్రంలో కేటాయింపుల కంటే ఎక్కువ జలాన్ని వాడుతుందని ఆరోపిస్తూ.. ఆ సమస్యను కూడా సుప్రీంకోర్టు వద్దకే తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఈ రోజు ఈ అంశంపై తీర్పును వెల్లడిస్తామని సుప్రీం కోర్టు చెప్పడంతో ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

Trending News