రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా: రంజిత్ సావర్కర్

''నా పేరు రాహుల్ సావర్కర్ కాదు... నా పేరు రాహుల్ గాంధీ'' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారంరేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Last Updated : Dec 15, 2019, 04:35 PM IST
రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా: రంజిత్ సావర్కర్

''నా పేరు రాహుల్ సావర్కర్ కాదు... నా పేరు రాహుల్ గాంధీ'' అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారంరేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేస్తానని హిందుత్వానికి ఐకాన్‌గా నిలిచిన వీర్ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ ప్రకటించారు. వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చర్చించేందుకు తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను కలుస్తానని రంజిత్ సావర్కర్ ప్రకటించారు. శివసేనకు వెన్నెముక హిందుత్వమే అయినందున.. హిందుత్వానికి ఐకాన్‌గా నిలిచిన వీర్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతానని రంజిత్ సావర్కర్ అన్నారు. శివసేన పార్టీ రాజకీయాల కంటే పార్టీ సిద్దాంతాలు, నీతికే ఎక్కువ విలువ ఇస్తుందని భావిస్తున్నానని రంజిత్ అభిప్రాయపడ్డారు. 

మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన స్వాతంత్ర్య సమరయోధులను, నాయకులను కించపర్చరాదని.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం సావర్కర్‌ని అవమానించి అదే తప్పు చేస్తోందని రంజిత్ సావర్కర్ అన్నారు. అందుకే మహారాష్ట్ర కేబినెట్‌లోంచి కాంగ్రెస్ నేతలను తొలగించి వారికి బుద్ధి చెప్పాలని రంజిత్ సావర్కర్ డిమాండ్ చేశారు.

Trending News