Van falls into Ganga river near Patna: పాట్నా: బిహార్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాట్నాకు సమీపంలోని దనపూర్ వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ పికప్ వ్యాన్ పాంటూన్ బ్రిడ్జిపై నుండి గంగా నదిలో పడిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘోర ప్రమాదంలో 15 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ స్పందిస్తూ అఖిపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తమకు సమాచారం అందింది అని అన్నారు. పీపా పుల్ దాటే క్రమంలో వాహనం అదుపు తప్పి కింద నదిలో పడిపోయినట్టు తెలిసిందని చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. చనిపోయిన వారిలో ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు సింగ్ పేర్కొన్నారు.
Also read : Oxygen Shortage: ఆక్సిజన్ కొరతతో ఒకే ఆసుపత్రిలో 25 మంది Covid-19 పేషెంట్లు మృతి
అఖిపూర్‌లో ఓ పెళ్లికి వెళ్లి దనాపూర్‌లోని తమ ఇంటికి తిరిగి ప్రయాణమైన కుటుంబం ఈ ప్రమాదంలో (Accident) అసువులుబాసింది. బీజేపి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్‌లో (rescue operations) పాల్గొంటున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook