Valentines Day: లవర్స్‌కు విజ్ఞప్తి.. వాలెంటైన్స్ డే ఇలా జరుపుకోండి

Valentines Day Special 2023: ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ప్రేమను వ్యక్తపరిచేందుకు అనువైన రోజు అని ప్రేమికులు భావించే రోజు. అయితే ఈ వాలెంటైన్స్ డేను కాస్త విభిన్నంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఎలా జరుపుకోవాలంటే..

Last Updated : Feb 8, 2023, 09:51 PM IST
Valentines Day: లవర్స్‌కు విజ్ఞప్తి.. వాలెంటైన్స్ డే ఇలా జరుపుకోండి

Valentines Day Special 2023: ప్రేమికుల దినోత్సవ సందడి మొదలైంది. వన్ సైడ్ లవర్స్ ప్రపోజ్ చేసేందుకు రెడీ అవుతుండగా.. ఇప్పటికే ప్రేమలో ఉన్న జంటలు తమ లవర్స్‌కు డిఫరెంట్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లవర్స్ డేను డిఫరెంట్‌గా జరుపుకోవాలని  యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 14న 'కౌ హగ్ డే' జరుపుకోవాలని దేశ ప్రజలను కోరింది. ఆవును కౌగిలించుకుని మూగజీవాల పట్ల ప్రేమను వ్యక్తం చేయాలని సూచించింది.

కేంద్ర ప్రభుత్వంలోని ఫిషరీస్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమ బోర్డు పనిచేస్తోంది. 'ఆవు భారతీయ సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని మనందరికీ తెలుసు. జీవవైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. మానవాళికి సర్వస్వం ప్రసాదించే తల్లిలా పోషించే స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల కామధేనువు, గౌమాత అని పిలుస్తారు.

పాశ్చాత్య సంస్కృతి పురోగతి కారణంగా మన కాలంలో వైదిక సంప్రదాయాలు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నాయి. పాశ్చాత్య నాగరికత మెరుపు మన భౌతిక సంస్కృతి, వారసత్వాన్ని మరచిపోయేలా చేసింది. ఆవు అపారమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఆవును కౌగిలించుకోవడం మానసిక శ్రేయస్సును తీసుకువస్తుంది. వ్యక్తిగత, సామూహిక ఆనందాన్ని పెంచుతుంది. ఆవు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని.. ఆవును ప్రేమికులందరూ కూడా ఫిబ్రవరి 14ని కౌ హగ్ డేగా జరుపుకోవచ్చు. జీవితాన్ని సంతోషంగా, సానుకూల శక్తితో నింపుకోవచ్చు..' అని కోరింది. 

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజ్యాంగ సంస్థ. దీనిని జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960 (పీసీఏ చట్టం) కింద స్థాపించారు. జంతువుల సంక్షేమానికి సంబంధించిన విషయాలలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. జంతువుల సంక్షేమం కోసమే ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పీసీఏ చట్టం.. ఈ చట్టం కింద రూపొందించిన నియమాల అమలుకు సంబంధించిన విషయాలను రూపొందిస్తుంది.

Also Read: Hyderabad Man Kidnap Case: వ్యక్తి కిడ్నాప్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయం.. సినిమా తరహాలో క్లైమాక్స్  

Also Read: MLA Mekapati Chandrasekhar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News