UPSC Civil Exam: వాయిదాకు సుప్రీం నో.. యథాతథంగా సివిల్ పరీక్ష

యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ పరీక్ష యథాతథంగా అక్టోబరు 4నే జరగనుంది. కరోనా, వరదల నేపథ్యంలో ఈ సివిల్స్ పరీక్షను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. 

Last Updated : Sep 30, 2020, 04:38 PM IST
UPSC Civil Exam: వాయిదాకు సుప్రీం నో.. యథాతథంగా సివిల్ పరీక్ష

SC rejected plea for postponing civil services exams: న్యూఢిల్లీ: యూపీఎస్సీ సివిల్‌ సర్వీస్‌ పరీక్ష (UPSC Civil Exam) యథాతథంగా అక్టోబరు 4నే జరగనుంది. కరోనా, వరదల నేపథ్యంలో ఈ సివిల్స్ పరీక్షను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) బుధవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు వాయిదా వేయలన్న అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం యూపీఎస్సీ (UPSC)కి పలు కీలక సూచనలు చేసింది. కరోనావైరస్ సోకి పరీక్షకు హాజరు కాకపోతో వారికి మరో అవకాశాన్ని కల్పించాలని యూపీఎస్సీకి సూచించింది. యూపీఎస్సీ నుంచి రిలాక్సేషన్‌ కోరినట్లయితే.. అది మర్యదపూర్వకంగా ఉండాలని సూచిస్తునే.. యూపీఎస్సీ బోర్టు పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతుందని కోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థుల రవాణాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీ ఇప్పటికే రాష్ట్రాలను కోరిందని కోర్టు తెలిపింది. Also read: Babri Masjid Demolition Verdict: బాబ్రీ కూల్చివేత ప్లాన్ కాదు.. అందరూ నిర్దోషులే

కరోనావైరస్ (Coronavirus), వరదల (floods) నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు తలెత్తాయని.. UPSC పరీక్షలను మూడు నెలలపాటు వాయిదా వేయాలని పలు రాష్ట్రాలకు చెందిన 20 మంది అభ్యర్థులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పరీక్ష నిర్వహణపై సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని మంగళవారం న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంలో అఫిడవిట్‌ను సమర్పించింది. అయితే ఇప్పటికే పరీక్ష నిర్వహణ కోసం 50 కోట్లను ఖర్చు చేశామని.. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేశామని, సివిల్స్‌ పరీక్ష వాయిదా వేసే ప్రసక్తే లేదని యూపీఎస్సీ పేర్కొంది. వాయిదా వల్ల ఈ ప్రభావం వచ్చే ఏడాది పరీక్షపై పడుతుందని తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 4వ తేదీనే పరీక్ష జరుగుతుందని తెలిపింది. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. అయితే యూపీపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020 కోసం.. నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేసింది. Also read: Babri Masjid demolition case: నేడే బాబ్రీ తీర్పు

Trending News