Farmers protest: 24 గంటల్లో రహదార్లు ఖాళీ చేయాలంటూ యూపీ ప్రభుత్వం అల్టిమేటం

Farmers protest: నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 24 గంటల్లోగా రహదార్లు ఖాళీ చేయాలని యూపీ ప్రభుత్వం హెచ్చరించింది.

Last Updated : Jan 28, 2021, 07:50 PM IST
Farmers protest: 24 గంటల్లో రహదార్లు ఖాళీ చేయాలంటూ యూపీ ప్రభుత్వం అల్టిమేటం

Farmers protest: నూతన వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 24 గంటల్లోగా రహదార్లు ఖాళీ చేయాలని యూపీ ప్రభుత్వం హెచ్చరించింది.

దేశ రాజధాని నగరం ఢిల్లీ సరిహద్దు ( Delhi Borders )ల్లో రైతుల ఆందోళన ( Farmers Protest ) కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 కొత్త వ్యవసాయ చట్టాల్ని( New Farm laws ) రద్దు చేయాలన్న డిమాండ్‌తో రెండు నెలలకు పైగా ఆందోళన కొనసాగుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ  ( Tractor Rally ) చివరికి హింసాత్మకమైంది. ఎర్రకోటను ముట్టడించి ఖల్సా జెండా ఎగురవేశారు. ఈ అల్లర్లకు సంబంధించి దాదాపు 2 వందల మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మేధాపాట్కర్, యోగేంద్ర యాదవ్ సహా 37 మంది రైతు నేతలపై ఎఫ్ఐఆర్ ( FIR on Farmer leaders ) నమోదైంది. ఢిల్లీ ఘటనలో మొత్తం 394మంది పోలీసులు గాయపడ్డారు. రైతు సంఘం నేతలపై ఐపీసీ 147, 148, 307, 120బి సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గాయపడిన పోలీసుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit shah ) పరామర్శించారు. 

ఇప్పుడు రైతులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. 24 గంటల్లోగా రహదారులను ( Up government to vacate farmers ) ముఖ్యంగా ఘాజీపూర్ రహదారిని ఖాళీ చేయాల్సిందిగా యూపీ ప్రభుత్వం ( Up Government ) హెచ్చరించింది. రైతుల్ని తక్షణం రహదార్ల నుంచి ఖాళీ చేయించాల్సిందిగా యుపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( Up cm yogi Adityanath ) పోలీసులకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం పోలీసులు రైతుల్ని ఖాళీ చేయించే పనిలో పడ్డారు. సింఘు బోర్డర్ వద్ద రైతులు రహదార్లను దిగ్బంధించడంతో అసౌకర్యం కలుగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారని యూపీ ప్రభుత్వం చెబుతోంది. ట్రాక్టర్ల ర్యాలీ ఘటన నేపధ్యంలో రైతు సంఘాలు ఒక్కొక్కటిగా ఆందోళన నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పటి వరకూ నాలుగు రైతు సంఘాలు ఆందోళన నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాయి.

Also read: DRDO Online Courses 2021: డీఆర్డీవో ఆన్‌లైన్ కోర్సులకు ఇలా దరఖాస్తు చేయాలి..ఇవే అర్హతలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News