Yogi on farmers protest: రైతుల ఆందోళన వెనుక మందిర వ్యతిరేక శక్తులు

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

Last Updated : Dec 17, 2020, 08:44 PM IST
Yogi on farmers protest: రైతుల  ఆందోళన వెనుక మందిర వ్యతిరేక శక్తులు

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ( Central government ) కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు ( Agriculture acts ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత 17 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ( Up cm yogi adityanath ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర ( Ram mandir ) నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులే రైతుల ఆందోళన ( Farmers protest ) వెనుక ఉన్నారంటూ యోగి వ్యాఖ్యానించారు. దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు విపక్షాలు రైతుల్ని వాడుకుంటున్నాయన్నారు. దేశంలో అశాంతి కల్గించేందుకు విపక్షాలు కుట్ర పన్నాయన్నారు. 

ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్‌ను వ్యతిరేకించేవారు చేస్తున్న పని ఇదేనని యోగీ తెలిపారు. కనీస మద్దతు ధర కావాలనేది తమ తొలి డిమాండ్ అని రైతులు చెప్పడం విన్పించిందని యోగి ఆదిత్యనాధ్ చెప్పారు. అదే కనీస మద్దతు ధర నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతున్నప్పుడు రైతుల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రశ్నించారు.  

అయోధ్య ( Ayodhya ) లో మహా రామాలయం నిర్మాణాన్ని కొంతమంది సహించలేకపోతున్నారని..రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ ( pm modi ) శంకుస్థాపన చేయడం చేయడంతో ఆగ్రహంంగా ఉన్నారని యోగీ వ్యాఖ్యానించారు. రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్నవారే రైతుల ఉద్యమం వెనుక ఉన్నారని యోగి ఆదిత్యనాధ్ స్పష్టం చేశారు. Also read: Farmers protest: రైతులకు ఆ హక్కు లేదు..సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు

Trending News