Rajasthan Unique Baby: రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది, రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో ఓ వింత శిశువు జన్మించింది. అయితే ఈ నవజాత శిశువు పుట్టిన 20 నిమిషాలకే మరణించింది. అయితే బిడ్డ తల్లి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన చురు జిల్లాలోని రతన్‌గఢ్‌లోని గంగారాం ఆస్పత్రిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ వింత పాపను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చాలా మంది జనం తరలివచ్చారు.
వివరాల్లోకి వెళితే...
రతన్‌గఢ్‌లో రాజల్‌దేసర్‌లోని 3వ వార్డులో నివాసం ఉంటున్న 19 ఏళ్ల గర్భిణి హజారీ సింగ్ కు పురిటినొప్పులు రావడంతో ఆదివారం రాత్రి 8 గంటలకు ఆస్పత్రిలో చేరింది. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించిన వైద్యులు అందులో వింత శిశువు కనిపించినట్లు డాక్టర్ కైలాష్ సొంగరా తెలిపారు. ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత హజారీ సింగ్ కు నార్మల్ డెలివరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ రకమైన డెలివరీని కంజుక్టివల్ అనోమలీ అంటారు. అయితే 20 నిమిషాలకే బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ బిడ్డ ఇలా పుట్టడానికి క్రోమోజోమ్‌ల లోపం కావచ్చ అని వారు తెలిపారు.
2022 డిసెంబరులో ఇలాంటి వింత ఘటనే మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్ జిల్లాలో ఓ పాప నాలుగు కాళ్లతో పుట్టింది. అయితే ఈ బిడ్డ పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read: Varanasi: కాశీలో ప్రసాదంగా 'మిల్లెట్ లడ్డూలు'.. 'శ్రీ అన్న ప్రసాదం'గా పేరు మార్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook