GST: చేనేతపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా:. స్పష్టం చేసిన కేంద్రం!!

చేనేత, జౌళిపై పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 06:46 PM IST
  • చేనేతపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా
  • ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంచే యోచన లేదు
  • పక్కా సమాచారంతో తనిఖీలు
GST: చేనేతపై జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా:. స్పష్టం చేసిన కేంద్రం!!

Union Finance Minister Nirmala Sitharaman says No increase in GST on textiles: చేనేత, జౌళిపై పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తు సేవల పన్ను (GST) కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి (Union Finance Minister) నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ఆర్థిక మంత్రి అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ అత్యవసర సమావేశంలో చేనేత పన్ను రేటును యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలానే ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు (ITR) గడువును పెంచే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం (Central Govt) స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదనేమీ తమ వద్దకు రాలేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. 

కొన్ని వస్తువులపై విధించిన జీఎస్‌టీ పెంపుపై చర్చించాలన్న ఏకైక ఎజెండాతో జీఎస్‌టీ మండలి ఈరోక్జు భేటీ అయ్యిందని నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం తర్వాత మీడియా సమావేశంలో సీతారామన్ మాట్లాడుతూ... 'చేనేత, జౌళిపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టాం. ఈ విషయంపై మరింత లోతైన సమీక్ష జరిపేందుకు 'పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కమిటీ'కి పంపాము. ఫిబ్రవరి నాటికి ఈ కమిటీ తమ నివేదికను సమర్పిస్తుంది. పాదరక్షలపై విధించిన జీఎస్టీ పెంపును 2022 జనవరి 1 నుంచి అమలు చేస్తున్నాం' అని పేర్కొన్నారు. 

Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో పోస్టర్.. రామ్ చరణ్ గెటప్ పోలా అదిరిపోలా!!

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నల్లధన కుబేరుడు పీయూష్‌ జైన్‌పై ఆదాయపు పన్ను శాఖ పొరపాటున దాడి చేసిందంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) చేస్తున్న ఆరోపణలపై నిర్మలా సీతారామన్‌ స్పందించారు. 'పక్కా సమాచారంతో సరైన వ్యక్తిపైనే ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఎస్పీకి చెందిన ఎమ్మెల్సీ, అత్తరు వ్యాపారి పుష్పరాజ్‌ జైన్‌పై ఐటీ దాడులు ముందస్తు సమాచారం మేరకే జరుగుతున్నాయి' అని సీతారామన్‌ అన్నారు. పీయూష్‌ జైన్‌ ఇంట్లో దొరికిన సొమ్మంతా బీజేపీదే అని వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఐటీ దాడులతో వణికిపోతున్నారంటూ సీతారామన్‌ ఎద్దేవా చేశారు. పీయూష్‌ జైన్‌ ఇంట్లో దొరికిన సొమ్ము ఎవరిదో అఖిలేశ్‌ ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించారు. తనిఖీలు జరుపుతున్న అధికారులు ఉత్తి చేతులతో రావడం లేదని, అలాంటప్పుడు దీంట్లో రాజకీయ కుట్ర ఉందని ఎలా అంటారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: Ayyappa Idol Eyes Open: అభిషేకం జరుగుతుండగా కళ్లు తెరిచిన అయ్యప్ప విగ్రహం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News