Tejas jet fighters: 48 వేల కోట్లతో త్వరలో 83 జెట్ ఫైటర్లు

Tejas jet fighters: భారత అమ్ములపొదిలో మరో అధునాతన జెట్ ఫైటర్స్ వచ్చి చేరనున్నాయి. అత్యాధునిక తేలికపాటి యుద్దవిమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Last Updated : Jan 13, 2021, 08:35 PM IST
Tejas jet fighters: 48 వేల కోట్లతో త్వరలో 83 జెట్ ఫైటర్లు

Tejas jet fighters: భారత అమ్ములపొదిలో మరో అధునాతన జెట్ ఫైటర్స్ వచ్చి చేరనున్నాయి. అత్యాధునిక తేలికపాటి యుద్దవిమానాల కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra modi ) నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక తేలికపాటి యుద్ధవిమానాలైన తేజస్ జెట్ ఫైటర్లను కొనుగోలు చేసేందుకు కేబినెట్ ( Union cabinet ) ఆమోదించింది. 48 వేల కోట్లతో 83 మోడర్న్ తేజస్ జెట్ ఫైటర్లను త్వరలో కొనుగోలు చేయనుంది ఇండియా. 

తేజస్ జెట్ ఫైటర్లను గేమ్ ఛేంజర్లుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Rajnath singh ) అభివర్ణించారు. రానున్న కాలంలో భారత వైమానికదళంలో తేజస్ ఆధునిక జెట్ ఫైటర్లు ( Tejas jet fighters ) చేరనున్నాయి. తేజస్ స్వదేశీ కంటెంట్ ఎంకే 1ఏ వేరియంట్‌లో 50 శాతంగా ఉంది. దీన్ని త్వరలో 60 శాతానికి పెంచనున్నారు. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఈ జెట్ ఫైటర్లను కొనుగోలు చేయనున్నారు. 

Also read: Cobra attack: రెప్పపాటులో కోబ్రా కాటు నుంచి తప్పించుకున్న వ్యక్తి, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News