Budget Facts: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండవ దఫా ప్రభుత్వంలో చివరి బడ్జెట్ ఇది. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ బడ్జెట్‌పై అటు ఆదాయవర్గాలు, రైతులు, పారిశ్రామిక వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేముందు బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలి. ఎన్నికల ఏడాది ప్రవేశపెట్టేది కావడంతో దీనిని మద్యంతర బడ్జెట్ లేదా ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ అంటారు. ఇది కేవలం మూడు నెలలకే ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2024-25కు సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుంది.
దేశంలో ఇప్పటివరకూ 77 పూర్తి స్థాయి బడ్జెట్‌లు, 14 తాత్కాలిక బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. స్వతంత్ర్య భారతదేశపు తొలి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు. అదే అప్పటి తొలి తాత్కాలిక బడ్జెట్ కూడా. నాటి బడ్జెట్‌లో ప్రభుత్వ ఆదాయం అంచనా 171 కోట్లు. తొలి ఆర్ధిక మంత్రి షణ్ముగ శెట్టి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1948 ఏప్రిల్ 1న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బ్రిటీషు ప్రభుత్వం హయాంలో భారతదేశపు తొలి బడ్జెట్‌ను 1860లో ప్రవేశపెట్టారు. అప్పుడే తొలిసారిగా ఇన్‌కంటాక్స్ ప్రయోగం జరిగింది. గతంలో యూకే ప్రభుత్వం సమయం ప్రకారం సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ఉండేది. ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్ ఉండేది.
బ్రిటీషర్లు మొదలుపెట్టిన సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే సాంప్రదాయం చాలా కాలం కొనసాగింది. 1999లో అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా స్వస్తి చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకూ అంటే 2014 వరకూ రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్ వేర్వేరుగా ఉండేవి. ఆ తరువాత రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపి ప్రవేశపెట్టడం ప్రారంభమైంది.
Also read: Jharkhand Politics: హేమంత్ సోరెన్ అరెస్ట్, జార్ఘండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Budget Facts: దేశంలో బడ్జెట్ గురించి ఆసక్తికరమైన అంశాలు, తొలి బడ్జెట్ ఆదాయం అంచనా