UIDAI Aadhaar Data: బయోమెట్రిక్ డేటా ఎవరితోనైనా షేర్ అవుతోందా, ఢిల్లీ హైకోర్టులో ఏం జరిగింది

UIDAI Aadhaar Data: ఆధార్ ..ప్రతి పనికీ ఆధారమైపోయింది. కీలకమైన బయోమెట్రిక్ సమాచారాన్ని యూఐడీఏఐ మరెవరితోనైనా షేర్ చేస్తోందా లేదా.ఇప్పుడీ సందేహమే చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఏముంది

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 6, 2022, 12:05 AM IST
  • ఆధార్ కార్డు బయోమెట్రిక్ సమాచారం ఇతరులకు షేర్ అవుతోందా
  • చర్చనీయాంశమౌతున్న ఢిల్లీ హైకోర్టు ప్రశ్నలు, అసలేం జరిగింది
  • బయోమెట్రిక్ డేటా షేరింగ్‌పై యూఐడీఏఐ ఏం చెప్పింది
UIDAI Aadhaar Data: బయోమెట్రిక్ డేటా ఎవరితోనైనా షేర్ అవుతోందా, ఢిల్లీ హైకోర్టులో ఏం జరిగింది

UIDAI Aadhaar Data: ఆధార్ ..ప్రతి పనికీ ఆధారమైపోయింది. కీలకమైన బయోమెట్రిక్ సమాచారాన్ని యూఐడీఏఐ మరెవరితోనైనా షేర్ చేస్తోందా లేదా.ఇప్పుడీ సందేహమే చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఏముంది..

ఆధార్ కార్డులో అత్యంత కీలకమైంది ప్రతి ఒక్కరి బయోమెట్రిక్ సమాచారం. ఇది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకం. చాలా సెన్సిటివ్ సమాచారమిది. దుర్వినియోగం కాకుండా కచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి అలా జరుగుతోందా..మన నుంచి సేకరించిన బయోమెట్రిక్ సమాచారాన్ని యూఐడీఏఐ మరెవరితోనైనా షేర్ చేస్తోందా లేదా. ఈ విషయమే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో చర్చనీయాంశమైంది. మరి యూఐడీఏఐ ఏం చెప్పింది..

ఆధార్ చట్టం ప్రకారం సేకరించే కోర్ బయోమెట్రిక్ సమాచారాన్ని ఎవరితోనూ, ఏ సందర్భంలోనూ , ఏ కారణంతోనైనా షేర్ చేయడం లేదని యూఐడీఏఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. సాంకేతికత, స్టాండ్స్ లేదా ఫోరెన్సిక్ కోసం సరిపోయే ప్రోసీజర్ ఆధారంగా బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించడం లేదని యూఐడీఏఐ నిర్ధారించింది. ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయాలు పొందుపర్చింది. ఆధార్ చట్టం సెక్షన్ 2జే ప్రకారం ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని కోర్ బయోమెట్రిక్ సమాచారంగా పిలుస్తారు. అంటే చట్టంలో కోర్ బయోమెట్రిక్ సమాచారం షేర్ చేయకూడదని స్పష్టంగా ఉందని వెల్లడించింది. 

2018లో జరిగిన ఓ దొంగతనం , హత్య కేసులో నేరం జరిగిన స్థలం నుంచి సేకరించిన బయోమెట్రిక్ సమాచారాన్ని ఆధార్ డేటా బేస్‌తో పోల్చిన సందర్భంలో కోర్టు కోరిన వివరణకు యూఐడీఏఐ అఫిడవిట్ ఇచ్చింది. బయోమెట్రిక్ సమాచారం అనేది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైందే కాకుండా విభిన్నమైంది. అందుకే ఈ సమాచారం దుర్వినియోగం కాకుండా రక్షించుకోవల్సిన అవసరముంది. సంబంధిత వ్యక్తి  అనుమతి లేకుండా బయోమెట్రిక్ సమాచారాన్ని ఏ అవసరం కోసమైనా షేర్ చేయడం నిషేధం. అదే సమయంలో ఆధార్ డేటా కూడా ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఎప్పుడూ ఎక్కడా షేర్ చేయలేదని కూడా యూఐడీఏఐ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

అదే సమయంలో బయోమెట్రిక్ డేటాను ఫోరెన్సిక్ విశ్లేషణలో ఉపయోగించడం సాధ్యం కాదని..ఇది చట్ట పరిధిలోనిది కాదని కూడా యూఐడీఏఐ తెలిపింది. ఎందుకంటే  ఫోరెన్సిక్ కోసం ఆ ప్రోసీజర్‌లో ఎప్పుడూ కోర్ డేటా సేకరించడం జరగదు. 

Also read: Terrorists Plot For Bomb Blasts: దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. తెలంగాణకు ఆయుధాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News