కేంద్ర బడ్జెట్ లో రైతుల ఆదకునే ;పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ చర్యలో భాగంగా పంట వేసుకునేందుకు రూ. 6000 మాత్రమే ప్రకటించారు. ఈ అంశంపై టీఆఎస్ఎస్ ఎంపీ కవిత స్పందించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని పేర్కొన్నారు.
కేంద్ర నిర్ణయాన్ని ఆహ్వనిస్తాం...కానీ
ఏది ఏమైనప్పటికీ ఇది ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంలో తెలంగాణలో రైతు బంధు పథకాన్ని మరింత సానబెట్టేందుకు ఉపయోగపడుతుందన్నారు. రైతుబంధు ద్వారా ఏడాదికి రెండు సార్లు ప్రతి ఎకరానికి రూ. 5000 చొప్పున ఇస్తున్నామని.. కేంద్రం సాయం జోడించి ఈ పథకానికి భవిష్యత్తులో దీన్ని మరింత మెరుగుపర్చుతామన్నారు.
ఐదు ఎకరాలలోపు భూమి గల రైతులకు ఏడాదికి రూ. 6000 ఇస్తామని ఈరోజు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ మేరకు స్పందించారు.
బడ్జెట్ ఎఫెక్ట్: రైతు బంధు పథకానికి మరింత సానబెడతామన్న కవిత