Train ticket cancellation Charges: రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా.. జీఎస్టీ భరించాల్సిందే

Train Ticket Cancellation Charges: ట్రెయిన్ టికెట్ ఒకసారి బుక్ చేసుకున్నాకా రద్దు చేసుకుంటే దానిపై క్యాన్సిల్ చార్జీలు వర్తిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చార్జీలే అదనపు భారం అవుతున్నాయని రైల్వే ప్రయాణికులు భావిస్తుండగా.. తాజాగా కేంద్రం మరో పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది.

Written by - Pavan | Last Updated : Aug 31, 2022, 11:45 PM IST
Train ticket cancellation Charges: రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా.. జీఎస్టీ భరించాల్సిందే

Train Ticket Cancellation Charges: ట్రెయిన్ టికెట్ ఒకసారి బుక్ చేసుకున్నాకా రద్దు చేసుకుంటే దానిపై క్యాన్సిల్ చార్జీలు వర్తిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చార్జీలే అదనపు భారం అవుతున్నాయని రైల్వే ప్రయాణికులు భావిస్తుండగా.. తాజాగా కేంద్రం మరో పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. అవును.. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయంతో ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు టికెట్ రద్దుపై క్యాన్సిలేషన్ చార్జీలు మరింత పెరగనున్నాయి. ఇకపై రైలు టికెట్ రద్దుపై 5 శాతం జీఎస్టీ కూడా వడ్డించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణం. 

ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకోవడం అనేది ఐఆర్‌సీటీసీ లేదా ఇండియన్ రైల్వేకు ప్రయాణికుడి మధ్య జరిగే ఒక కాంట్రాక్ట్ అని.. అలాగే ఆ టికెట్ రద్దు చేసుకోవడం అనేది కూడా ఒక కాంట్రాక్టును రద్దు చేసుకోవడం కిందకే వస్తుంది కనుక సదరు లావాదేవీలపై జరిగే మొత్తంపై 5 శాతం జీఎస్టీ వడ్డింపు వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది. అయితే, ప్రస్తుతానికి ఇది ఏసీ, ఫస్ట్ క్లాస్ రైలు టికెట్స్‌కి మాత్రమే వర్తిస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది.

రైలు ప్రయాణికులు టికెట్ రద్దు చేసుకోవడం అంటే అది వారి మధ్య జరిగిన రైల్వే టికెట్ బుకింగ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంగానే అభివర్ణించిన కేంద్రం.. అలాంటి సందర్భాల్లో రైల్వేకు ప్రయాణికులు నష్టపరిహారంగా కొంత మొత్తాన్ని క్యాన్సిల్లేషన్ చార్జీల రూపంలో చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. అలా చెల్లించే మొత్తం పేమెంట్స్ కిందకే వస్తుంది కనుక ఆ పేమెంట్స్ పై జీఎస్టీ వర్తిస్తుందని ఆర్థిక శాఖ వివరించింది.

ఇదిలావుంటే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే క్యాన్సిల్లేషన్ చార్జీల రూపంలో రైల్వే ప్రయాణికుల నుండి వివిధ స్లాబుల్లో ముక్కు పిండీ మరీ వసూలు చేస్తోన్న కేంద్రం.. అలా ముక్కు పిండీ మరీ వసూలు చేస్తున్న చార్జీలపై కూడా జీఎస్టీ వడ్డన అంటే ప్రయాణికుడికి ఇంకేం మిగులుతుందనే విమర్శలు వస్తున్నాయి. రైల్వే ప్రయాణికులు, పౌరుల నుండి వస్తోన్న ఈ విమర్శలపై కేంద్రం స్పందిస్తుందా లేదా.. ఒకవేళ స్పందిస్తే, 5 శాతం జీఎస్టీ వడ్డింపు విషయంలో ఏమైనా పునరాలోచిస్తుందా అనేది వేచిచూడాల్సిందే.

Also Read : SBI Alerts: ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక, మెస్సేజ్‌లకు స్బందించవద్దని సూచన

Also Read : Multibagger Stocks: ఏడాదిలో లక్ష రూపాయల్ని..27 లక్షలు చేసిన షేర్, మల్టీ బ్యాగర్ స్టాక్స్ ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News