పతనమైన బంగారం ధరలు.. అదే దారిలో వెండి

లాక్‌డౌన్ నేపథ్యంలోనూ నిత్యం పెరుగుతున్న బంగారం ధరలు (Gold Rates Today) నేడు పతనం కాగా, అదే దారిలో వెండి నడిచింది.

Last Updated : Apr 10, 2020, 06:25 AM IST
పతనమైన బంగారం ధరలు.. అదే దారిలో వెండి

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rates Today)  నేడు స్వల్పంగా తగ్గాయి. లాక్‌డౌన్ నేపథ్యంలోనూ దాదాపు ప్రతిరోజూ పెరుగుతున్న బంగారం ధరలు నేడు పతనం కాగా, వెండి సైతం బంగారం దారిలోనే నడిచింది. జ్యువెలర్ల విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ప్రభావం చూపిస్తాయి.

హైదరాబాద్‌, (Gold Rates Today in Hyderabad)  విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.360 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,800కి పడిపోయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.130 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.40,030కి క్షీణించింది.  సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.120 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.44,500కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.42,170 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు రెండూ ఒకటి కాదా.. ఇది చదవండి

కాగా, వెండి ధరలు సైతం బంగారం బాటలోనే నడిచాయి. నిన్న మార్కెట్‌లో రూ.920 పెరిగిన వెండి ధరలు నేడు దిగొచ్చాయి. 1కేజీ వెండి రూ.330 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.40,950కి క్షీణించింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ఒక కేజీ వెండి ధర రూ.40,950 వద్ద కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

 

Trending News