Temple dedicated to Sonu Sood by dubba tanda villagers : బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సినిమాల్లో నటించేది విలన్‌గా అయినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం ఎంతో మందికి సాయం చేసి అందరి దృష్టిలో రియల్ హీరోగా, కలియుగ కర్ణుడిగా నిలిచారు. మార్చి నెలలో విధించిన కరోనావైరస్ లాక్‌డౌన్ (Corona Lockdown) నాటి సమయంలో సోనూసూద్ (Sonu Sood).. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి వారిని స్వస్థలాలకు పంపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.
ఇప్పటికీ కూడా తనను సంప్రదించిన వారందరికీ సాయం చేస్తూ రియల్ లైఫ్ హీరోగా, ఆపద్భాంధవుడిగా నిలుస్తున్నారు సోనూసూద్. అందుకే ఆయన్ను దేశం, ప్రపంచం మొత్తం మనసున్న మహారాజు, కలియుగ కర్ణుడిగా కీర్తిస్తోంది. ఈ క్రమంలో ఆయన అభిమానులు తమ పిల్లలకు, షాపులకు ఆయన పేరును పెట్టుకోవడమే కాకుండా.. మండపాల్లో సోనూ విగ్రహాలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ (Telangana) ప్రజలు సోనూసూద్ గౌరవార్థంగా ఆలయాన్ని సైతం నిర్మించారు. ఈ ఘటన ఎక్కడో కాదు సిద్దిపేట (Siddipet) జిల్లాలోని దుబ్బా తండాలో జరిగింది. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న సోనూసూద్‌ను కీర్తించుకుంటూ ఈ ఆలయం నిర్మించినట్టు దుబ్బతండా ప్రజలు ( dubbatanda ) వెల్లడించారు. Also read: Did Sonu Sood mortgage his properties: నిరుపేదలకు సాయం చేసేందుకు సోనూ సూద్ ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్నాడా ?
Telangana: Locals of Dubba Tanda village in Siddipet have constructed a temple to recognize Actor Sonu Sood's philanthropic work.
A local says, "He helped so many people during the pandemic. It's a matter of great delight for us that we've constructed his temple." (20.12.2020) pic.twitter.com/XZoj6x55pq
— ANI (@ANI) December 20, 2020
సోనూసూద్ విగ్రహం తయారు చేసిన శిల్పి, స్థానికుల సమక్షంలో ఆదివారం ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు జై హో సోనూసూద్.. అంటూ నినాదాలు చేసి పూజలు చేశారు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి స్థానికులే కాకుండా సిద్దిపేట జిల్లా అధికారులు కూడా సహకరించడం విశేషం. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన ఆలయాన్ని నిర్మించినట్లు (dubba tanda villagers built temple for sonu sood) స్థానికులు వెల్లడించారు. Also Read: Sonu sood: సోనూకు హీరో ఆప్ ది ఇయర్‌గా అరుదైన గౌరవం అందించిన యాహూ
Also read : Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook