CM Kcr Tour: రేపు తెలంగాణకు ప్రధాని..బెంగళూరుకు కేసీఆర్.. ఏం జరుగుతోంది..?

CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు దఫాలుగా కీలక నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 04:52 PM IST
  • జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఫోకస్
  • ఇప్పటికే పలువురు నేతలతో భేటీ
  • రేపు బెంగళూరుకు తెలంగాణ సీఎం
CM Kcr Tour: రేపు తెలంగాణకు ప్రధాని..బెంగళూరుకు కేసీఆర్.. ఏం జరుగుతోంది..?

CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలు దఫాలుగా కీలక నేతలతో భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు. ఇందులోభాగంగా తాజాగా సీఎం కేసీఆర్ ..బెంగళూరు వెళ్లనున్నారు. రేపు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అవుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఈ భేటీ జరుగుతుంది. జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. భేటీ అనంతరం సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌కు తిరుగు పయనం అవుతారు.

ఇటీవల ఆయన ఆలిండియా పర్యటన శ్రీకారం చుట్టారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడి సీఎం కేజ్రీవాల్‌తో మంతనాలు జరిపారు. ఇద్దరు కలిసి ఢిల్లీ సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. స్కూల్‌ ఆవరణలో పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు కేజ్రీవాల్‌ వివరించారు. ఢిల్లీ విద్య విధానంపై ఆరా తీశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. తెలంగాణలోనూ ఇదే విధానాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతకముందు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో ఆయనతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. 

బీజేపీ, కాంగ్రెస్‌ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పంజాబ్‌ వెళ్లారు. చండీఘడ్‌లో సాగు చట్టాల ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలు, అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో సంచలనాలు జరుగుతాయన్నారు. పంజాబ్‌ టూర్ తర్వాత సీఎం కేసీఆర్ మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. ఐతే అనివార్య కారణాలతో ఇటీవల సీఎం కేసీఆర్ ..హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా బెంగళూరు టూర్‌కు శ్రీకారం చుట్టారు.  

గతకొంతకాలంగా బీజేపీ తీరుపై సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు రేపు ప్రధాని మోదీ..హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈక్రమంలోనే ప్రధాని టూర్‌ నుంచి దూరంగా ఉండేందుకే బెంగళూరుకు వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో ఇదే జరిగింది. సమతామూర్తి ప్రారంభోత్సవం సందర్భంలోనూ ప్రధాని టూర్‌కు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. దీనిపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది. 
 

 

Also read:Taneti Vanitha comments: కోనసీమ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టం..తానేటి వనిత కీలక వ్యాఖ్యలు..!

Also read:LSG vs RCB Eliminator: ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం వారిదే.. కారణం ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News